ఖిలాడీ మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే..!

Khiladi First Day Collections. ఖిలాడీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా కలెక్షన్స్ మొదలుపెట్టింది.

By Medi Samrat  Published on  12 Feb 2022 1:29 PM GMT
ఖిలాడీ మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే..!

ఖిలాడీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా కలెక్షన్స్ మొదలుపెట్టింది. AP/TSలో మొదటి రోజు కలెక్షన్స్ దాదాపు రూ. 6 కోట్లు (రూ. 4 కోట్ల షేర్) మాత్రమే ఉంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల వెలుపల పెద్దగా ప్రభావం చూపించలేదు. భారతదేశంలో కేవలం రూ. 6.25 కోట్లు వసూలు చేయగలిగింది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదటి రోజు అంత గొప్పగా లేవు. ఇక వాక్-ఇన్‌లు కూడా అంత బలంగా లేవు. గతేడాది మొదటి రోజు క్రాక్ 10.65 కోట్లు (రూ. 6.94 కోట్ల షేర్) రాబట్టింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అయినా కూడా ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పెద్దగా లేవు.

AP/TSలో రవితేజ గత కొన్ని చిత్రాల ప్రారంభ రోజు షేర్ ఈ విధంగా ఉంది :

ఖిలాడీ - రూ. సుమారు 4 కోట్లు

క్రాక్ - రూ. 6.94 కోట్లు

డిస్కో రాజా - రూ. 2.46 కోట్లు

అమర్ అక్బర్ ఆంటోని - రూ. 3.40 కోట్లు

నేల టిక్కెట్టు - రూ. 3.47 కోట్లు

టచ్ చేసి చూడు - రూ. 4.19 కోట్లు

'ఖిలాడి' తరువాత సినిమాగా రవి తేజ శరత్ మండవ దర్శకత్వంలో 'రామారావు ఆన్ డ్యూటీ' చేస్తున్నాడు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమా మార్చి 25న గానీ ఏప్రిల్ 15వ తేదీన థియేటర్ల ముందుకు రానుంది. ఆ తరువాత సినిమాగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో 'ధమాకా' చేస్తున్నాడు రవి తేజ. తాజాగా 'రావణాసుర' కూడా రెండవ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, చిత్ర బృందం ఒక పోస్టర్ ను వదిలింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, రవితేజ సరసన ఐదుగురు హీరోయిన్లు సందడి చేయనున్నారు.


Next Story
Share it