కేజీఎఫ్-2 రిలీజ్ డేట్.. వచ్చేసింది..!

KGF Release Date. కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కేజీఎఫ్. ఈ సినిమా

By Medi Samrat  Published on  22 Aug 2021 10:35 AM GMT
కేజీఎఫ్-2 రిలీజ్ డేట్.. వచ్చేసింది..!

కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కేజీఎఫ్. ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది. సెకండ్ పార్ట్ ను మొదటి భాగం కంటే గ్రాండ్ గా ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. ఈ ఏడాది సినిమా విడుదలవుతుందని అందరూ అనుకున్నారు. కానీ పాన్ ఇండియా రేంజి సినిమా విడుదలవ్వాలంటే చాలా రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు ఓపెన్ చేయాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చాలా రాష్ట్రాల్లో సినిమా థియేటర్లకు అనుమతులు ఇవ్వలేదు. దీంతో కేజీఎఫ్-2 వచ్చే ఏడాదికి వాయిదా పడింది.

కేజీఎఫ్-2 చిత్రాన్ని జూలై 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర దర్శక నిర్మాతలు మొదట భావించారు. ఆ తర్వాత డిసెంబ‌ర్‌లో విడుద‌ల అవుతుంద‌ని అంతా అనుకున్నారు. కానీ అది కూడా కన్ఫర్మ్ కాదని తాజాగా దర్శక నిర్మాతలు తేల్చేశారు. తాజాగా ఏప్రిల్ 14, 2022న కేజీఎఫ్-2 చిత్రం విడుద‌ల కానుంద‌ని పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. కేజీఎఫ్ 2 చిత్రాన్ని తెర‌కెక్కించిన ప్ర‌శాంత్ నీల్ ప్ర‌భాస్‌తో 'స‌లార్' సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇక కేజీఎఫ్-2 కోసం ఇంకొన్ని రోజులు ఎదురుచూడాల్సి రావడం సినీ అభిమానులకు బాధను కలిగించే అంశమే..! ఈ సినిమా శాటిలైట్స్‌ హక్కులను జీ 5 సంస్థ కొనుగోలు చేసినట్లు చిత్ర యూనిట్ ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. భారీ ధరకు ఈ శాటిలైట్స్ హక్కులు విక్రయం అయినట్లు తెలుస్తోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్ ప్రధాన విలన్ పాత్రలో నటిస్తున్నారు. రవినా టండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.


Next Story
Share it