జయలలితకు నివాళులర్పించిన రీల్ 'తలైవి'

Kangana Ranaut Visits Jayalalitha Memorial. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత

By Medi Samrat
Published on : 4 Sept 2021 3:00 PM IST

జయలలితకు నివాళులర్పించిన రీల్ తలైవి

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బ‌యోపిక్ 'తలైవి'లో నటించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నటి కంగనా రనౌత్ 'తలైవి' ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం ఉదయం చెన్నై చేరుకున్నారు. అనంత‌రం చెన్నై మెరీనా బీచ్ లో ఉన్న జయలలిత సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. కొంత సమయంపాటు అక్కడే మౌనం పాటించిన కంగనా 'తలైవి' సినిమా విజ‌య‌వంత‌మ‌వ్వాల‌ని కోరుకున్నారు. అనంత‌రం ఎంజీఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు.

ఈ సినిమాలో జ‌య‌ల‌లిత‌గా కంగన నటిస్తుండగా.. ఎంజీఆర్‌గా అరవిందస్వామి సందడి చేయనున్నారు. ఏ.ఎల్‌.విజయ్‌ 'తలైవి' చిత్రాన్ని రూపొందించారు. భాగ్యశ్రీ కీలకపాత్రలో కనిపించనున్నారు. విష్ణువర్ధన్‌ ఇందూరి, శైలేష్‌ ఆర్‌.సింగ్‌, బ్రిందా ప్రసాద్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విద్యార్థి దశ నుంచి సినిమా హీరోయిన్ రాణించిన జ‌య‌ల‌లిత‌.. అక్కడి నుంచి రాజకీయ నేతగా ఎదిగే క్రమంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? ఎంజీఆర్‌తో ఆమెకు పరిచయం ఎలా ఏర్పడింది? ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం తెల‌కెక్కింది.


Next Story