డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా బుక్కయిన జబర్థస్త్ కమెడియన్!

Jabardasth Tanmay Caught In Drunk and Drive Case. తెలుగు బుల్లితెరపై వస్తున్న ఎన్నో కామెడీ షోల్లో అత్యంత ప్రజాదరణ పొందింది

By Medi Samrat  Published on  6 Feb 2021 4:13 AM GMT
డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా బుక్కయిన జబర్థస్త్ కమెడియన్!

తెలుగు బుల్లితెరపై వస్తున్న ఎన్నో కామెడీ షోల్లో అత్యంత ప్రజాదరణ పొందింది 'జబర్ధస్త్ కామెడీ షో'. ఏడేళ్ల క్రితం ప్రారంభం అయిన ఈ కామెడీ షో ఎంతో మంది ఔత్సాహిక కళాకారులకు మంచి వేధికగా నిలిచింది. జబర్ధస్త్ లో తమదైన కామెడీ పండించిన ఎంతో మంది కమెడియన్స్ ఇప్పుడు వెండి తెరపై కూడా తమ సత్తా చాటుతున్నారు. అయితే ఈ మద్య జబర్దస్త్ కామెడీ నుంచి కొంత మంది బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. జీ తెలుగులో వస్తున్న 'అదిరింది' కామెడీ షోలో నటిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జబర్ధస్త్ లో ఎన్నో కాంట్రవర్సీలు చెలరేగాయి.. అంతే కాదు డబుల్ మీనింగ్ డైలాగ్స్, బాడీ షేమింగ్స్‌తో వెకిలి నవ్వులు నవ్వుతున్నారంటూ విమర్శలు వచ్చాయి.

కానీ ఎక్కడా కూడా ఈ కామెడీ షోకి మాత్రం బ్రేక్ రాలేదు. ఇక హైదరాబాద్ లో ఈ మద్య డ్రంక్ అండ్ డ్రైవ్ పై సీరియస్ గా పోకస్ పెట్టారు ట్రాఫిక్ పోలీసులు. ఈ నేపథ్యంలో ఓ జబర్దస్త్ కమెడియన్ వివాదంలో చిక్కుకున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అడ్డంగా దొరికాడు. మందు తాగి వాహనం నడుపుతున్నాడని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జూబ్లిహిల్స్‌లో చేసిన తనిఖీల్లో జబర్దస్త్‌ కమెడియన్ తన్మయ్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడితో పాటు మరికొందరు ఈవెంట్ ఆర్గనైజర్స్‌ని అదుపులోకి తీసుకున్నారు. వారి వాహనాలను సీజ్ చేశారు. ఇదిలా ఉంటే జబర్ధస్త్ లో తన్మయ్ చాలా కాలంగా నటిస్తున్నాడు చేస్తున్నాడు. ఎక్కువగా లేడీ గెటప్స్ వేస్తుంటాడు.Next Story
Share it