ఆర్ఆర్ఆర్ విడుదల తేదీని అలా ఆమె లీక్ చేసేసిందిగా..!

Irish actor Alison Doody mistakenly posted RRR Movie release date. ఆర్ఆర్ఆర్.. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో

By Medi Samrat
Published on : 23 Jan 2021 12:49 PM

ఆర్ఆర్ఆర్ విడుదల తేదీని అలా ఆమె లీక్ చేసేసిందిగా..!

ఆర్ఆర్ఆర్.. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా.. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి ఎన్నో ప్రచారాలు జరిగాయి కానీ.. అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయలేకపోయారు. ఇక కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందా అని కూడా ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్న సమయంలో ఈ సినిమాలో నటిస్తున్న ఐరిష్ నటి కొత్త రిలీజ్ డేట్ ను లీక్ చేసిందని నెటిజన్లు చెబుతూ ఉన్నారు.



ఐరిష్‌ నటి అలిసన్‌ డూడీ సినిమా తేదీని అక్టోబ‌రు 8 అంటూ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ స్టోరీలో తెలిపింది. దానికి ఆర్‌ఆర్‌ఆర్ అకౌంట్‌ను జత చేసింది. కొద్ది సేప‌టికే ఆమె మ‌ళ్లీ ఈ పోస్టును తొల‌గించింది. అప్ప‌టికే కొద్ది మంది స్క్రీన్ షాట్లు తీసుకుని పెట్టుకున్నారు. దీంతో ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఇదేనంటూ ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ మొదలైపోయిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అందులో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్ ల చేతులు కనిపించాయి.



ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌కు జోడీగా హాలీవుడ్‌ నటి ఒలివియా మోరీస్‌, బాలీవుడ్‌ నటి అలియా భట్‌ నటిస్తుండగా.. కీలక పాత్రల్లో అజయ దేవగన్‌, సముద్ర ఖని, శ్రియా శరన్‌ కీలక పాత్రలు పోషించనున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, రామ్ చరణ్ 'భీం ఫర్ రామరాజు', ఎన్టీఆర్ 'రామరాజు ఫర్ భీం' వీడియోలు రికార్డులు క్రియేట్‌ చేయడంతో పాటు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.


Next Story