ఆ సినిమా ఓటీటీలో వచ్చేస్తోంది..!

Ichata Vahanamulu Nilupa radu Releases On OTT. టాలీవుడ్‌ కింగ్ నాగార్జున మేనల్లుడు, యంగ్‌ హీరో సుశాంత్‌ నటించిన తాజా చిత్రం ఇచ్చట

By Medi Samrat  Published on  8 Sep 2021 10:37 AM GMT
ఆ సినిమా ఓటీటీలో వచ్చేస్తోంది..!

టాలీవుడ్‌ కింగ్ నాగార్జున మేనల్లుడు, యంగ్‌ హీరో సుశాంత్‌ నటించిన తాజా చిత్రం ఇచ్చట వాహనములు నిలుపరాదు. ఎస్‌. దర్శన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. న‌టి భానుమ‌తి రామ‌కృష్ణ మ‌న‌వ‌డు ర‌వి శంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీశ్ కోయ‌ల‌గుండ్లల‌తో ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 27న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కులను ఆహా సొంతం చేసుకుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 17న ఆహాలో విడుదల చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు.

ఈ సినిమాకు ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూర్చారు.ఈ మూవీ కథ వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొందిందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రం ఒక నవల కాన్సెప్ట్‌తో విలక్షణమైన థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ సినిమా 6.5 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడింది. నాన్-థియేట్రికల్ బిజినెస్ తోనే లాభాలను చూశారని సినిమా రిలీజ్ కు ముందే ప్రచారం జరిగింది. ఓటీటీ హక్కుల కోసం ఆహా 3 కోట్లు, హిందీ హక్కులు సోనీ 2.75 కోట్లకు, శాటిలైట్ రైట్స్ 2 కోట్లకి అమ్ముడయ్యాయి. ఆదిత్య మ్యూజిక్ 15 లక్షలకు మ్యూజిక్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. డిజిటల్ డీల్స్ ద్వారానే మేకర్స్ 1.5 కోట్ల లాభాలను జేబులో వేసుకున్నారు.


Next Story
Share it