త్రివిక్రమ్ కారుకు ట్రాఫిక్ పోలీసుల ఫైన్‌..

Hyderabad Traffic Police Fines. ఎంతో మంది సినీ ప్రముఖులు నిబంధనలకు విరుద్ధంగా ఇంకా బ్లాక్ ఫిల్మ్ తో ఉన్న కారు అద్దాలనే వాడుతూ ఉన్నారు.

By Medi Samrat  Published on  4 April 2022 12:33 PM IST
త్రివిక్రమ్ కారుకు ట్రాఫిక్ పోలీసుల ఫైన్‌..

ఎంతో మంది సినీ ప్రముఖులు నిబంధనలకు విరుద్ధంగా ఇంకా బ్లాక్ ఫిల్మ్ తో ఉన్న కారు అద్దాలనే వాడుతూ ఉన్నారు. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీల వాహనాల అద్దాలకు సంబంధించిన బ్లాక్ ఫిల్మ్ ను పోలీసులు తొలగిస్తూ వచ్చారు. ఎంతో మంది ఫైన్స్ కట్టడానికి సిద్ధమే కానీ.. ఆ బ్లాక్ ఫిల్మ్ ను తొలగించే ప్రస్తక్తే లేదన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ విషయంలో కూడా అదే జరిగింది. సినీ దర్శకుడు త్రివిక్రమ్ కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ తొలగించి జరిమానా విధించారు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అటుగా వచ్చిన త్రివిక్రమ్ కారును ఆపిన పోలీసులు కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ తొలగించడమే కాకుండా ఫైన్ కూడా విధించారు.

త్రివిక్రమ్ అల వైకుంఠపురములో సినిమాతో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ని సాధించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. త్రివిక్రమ్.. ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లతో సినిమా చేసే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వచ్చాయి. అల్లు అర్జున్, తారక్ ఇద్దరూ త్రివిక్రమ్‌తో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. 2022 ముగిసేలోపు మహేష్ బాబు సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేశాక తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ, ప్రశాంత్ నీల్, బుచ్చిబాబులతో సినిమాలు చేయాల్సి ఉంది.

Next Story