ఓం నమః శివాయ.. చిన్న బ్రేక్.. మళ్లీ వస్తా..!
Hero Ram Take A Break From Movies. హీరో రామ్.. తాజాగా రెడ్ సినిమాతో అలరించాడు. అయితే.. ఆ సినిమా అనంతరం
By Medi Samrat Published on
6 Feb 2021 7:29 AM GMT

హీరో రామ్.. తాజాగా రెడ్ సినిమాతో అలరించాడు. అయితే.. ఆ సినిమా అనంతరం కాస్తా బ్రేక్ తీసుకున్నాడు. ఈ మేరకు తాజాగా ట్విటర్‌లో ఓ ట్వీట్ చేశాడు. హీరో రామ్ శివ మాలను ధరించాడు. దీంతో 41 రోజుల పాటు దీక్షలో ఉండాలి.. అందుకని రామ్ కొద్ది రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
శివుడి మాలధారణతో ఉన్న తన ఫొటోను సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసి.. ఓం నమః శివాయ, చిన్న బ్రేక్ తీసుకున్నాను. మళ్లీ వస్తాను.. అంటూ రాసుకొచ్చాడు. రెడ్ సినిమా అనంతరం రామ్ తదుపరి సినిమా విషయమై ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం లేదు. దీక్ష తర్వాత రాబోయే సినిమాల విషయమై రామ్ క్లారిటీ ఇస్తాడని టాక్.
Next Story