హీరో రామ్ కు ఏమైంది.. మెడలో ఆ బ్యాండేజ్ ఏమిటో..!

Hero Ram Injured Pic Goes Viral In Social Media. హీరో రామ్.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ ను అందుకున్నాడు. ఆ తర్వాతి సినిమాల్లో

By Medi Samrat  Published on  4 Oct 2021 12:38 PM IST
హీరో రామ్ కు ఏమైంది.. మెడలో ఆ బ్యాండేజ్ ఏమిటో..!

హీరో రామ్.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ ను అందుకున్నాడు. ఆ తర్వాతి సినిమాల్లో రామ్ కొత్తగా కనిపించాలని ట్రై చేస్తూ ఉన్నాడు. రెడ్ సినిమా కూడా అదే కోవకు చెందినది. ఆ సినిమా తర్వాత లింగుసామి దర్శకత్వంలో రామ్ ఒక మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం రామ్ త‌న లుక్‌ను పూర్తిగా మార్చుకుంటున్నాడు. భారీ వర్కౌట్లు చేస్తున్న రామ్ మెడ‌కు గాయ‌మైంది. దీంతో షూటింగ్ ఆగింది. రామ్ మెడ‌కు బ్యాండేజ్ ఉన్న ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. రామ్ ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ కంటే ఈ సినిమాలో ఇంకా బీస్ట్ లుక్‌లో కనపడాలని రామ్ ప్రయత్నిస్తున్నాడు. జిమ్‌లో గట్టిగా కష్టపడుతూ ఉన్నాడు. జిమ్ లో ఆయనకు గాయమవ్వడంతో సినిమా షూటింగ్ లు నిలిచిపోయాయి.


తెలుగు, త‌మిళంలో రామ్ లింగు సామి సినిమా చేస్తున్నాడు. ముప్పై రోజుల పాటు జ‌రిగిన తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నాడు. శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇస్మార్ట్ శంకర్‌తో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో రామ్‌ను తమిళ ప్రేక్షకులకు కూడా దగ్గర చేయాలనే ఉద్దేశంతోనే లింగుసామి ఓ మాస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే యాబై శాతం పైగా షూటింగ్‌ పూర్తయ్యిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఎంతో వేగంగా సినిమా షూటింగ్ సాగుతూ ఉండగా.. ఇప్పుడు రామ్ కు గాయం కారణంగా షూటింగ్ వాయిదా పడింది.


Next Story