మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కు కరోనా పాజిటివ్

Hero Ram Charan Tested For Covid-19 Positive. క‌రోనా వైర‌స్ ఎవ్వ‌రిని వ‌ద‌ల‌డం లేదు. చిన్నా-పెద్దా, పేదా-ధనిక అన్న తేడా

By Medi Samrat  Published on  29 Dec 2020 3:40 AM GMT
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కు కరోనా పాజిటివ్

క‌రోనా వైర‌స్ ఎవ్వ‌రిని వ‌ద‌ల‌డం లేదు. చిన్నా-పెద్దా, పేదా-ధనిక అన్న తేడాలు లేకుండా అంద‌రూ ఈ మ‌హమ్మారి బారిన ప‌డుతున్నారు. ఇప్ప‌టికే చాలా సినీ ప్ర‌ముఖులు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి కోలుకున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది.ఈ విషయాన్ని రామ్‌చరణ్ స్వయంగా ప్రకటించాడు. 'కరోనా టెస్ట్ చేయించుకోగా వైద్యులు పాజిటివ్ అని ధృవీకరించారు. ఎలాంటి లక్షణాలైతే లేవు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాను. త్వరలోనే కోలుకుంటాను. మరింత బలవంతుడనై వస్తాను అంటూ రామ్ చరణ్ ఒక ప్రకటన విడుదల చేశాడు.


Next Story
Share it