శివబాలాజీ చేయి కొరికిన హేమ..!
Hema Bites Shiva Balaji. 'మా’ఎన్నికల పోలింగ్ పూర్తైన విషయం తెలిసిందే. అయితే ఉదయం నుండి సాధరణ ఎన్నికల
By Medi Samrat Published on
10 Oct 2021 11:59 AM GMT

'మా'ఎన్నికల పోలింగ్ పూర్తైన విషయం తెలిసిందే. అయితే ఉదయం నుండి సాధరణ ఎన్నికల స్థాయిలో హడావుడి నెలకొంది. ఉదయం నుండి నటీనటులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటు వేయడం జరిగింది. ఈ నేఫథ్యంలోనే ఇప్పటవరకూ ఏ ఎలక్షన్‌లో నమోదు కానంత ఓటింగ్ నమోదైంది. ఇక చిన్న చిన్న గొడవలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే.. నటి హేమ, శివబాలాజీ చేయి కొరికారని కాసేపు హడావుడి నెలకొంది.
అయితే.. విషయమై ఆమె స్పందిస్తూ.. తాను వెళ్తున్న సమయంలో శివ బాలాజీ చేయి అడ్డుగా పెట్టారని, తప్పుకోమంటే తప్పుకోలేదని, అందుకే చేయి కొరకాల్సి వచ్చిందని అన్నారు. దాని వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా సాగినట్లు హేమ పేర్కొన్నారు. ఈ విషయమై శివబాలాజీ మాట్లాడుతూ.. హేమ చేయి కొరికిన విషయాన్ని తేలిగ్గా కొట్టి పారేశారు. అలాగే.. ఇక తనకూ బెనర్జీకి ఎలాంటి గొడవ జరగలేదని కూడా శివ బాలాజీ అన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తుంటే వాగ్వాదం మాత్రమే జరిగినట్లు తెలిపారు.
Next Story