'హరి హర వీర మల్లు' సినిమాలో అదే హైలైట్ అంటున్నారే..!

Hari Hara Veeramallu Update. పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడికల్-థ్రిల్లర్ మూవీ 'హరి హర వీర మల్లు' కు సంబంధించిన

By Medi Samrat  Published on  11 April 2022 4:40 PM IST
హరి హర వీర మల్లు సినిమాలో అదే హైలైట్ అంటున్నారే..!

పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడికల్-థ్రిల్లర్ మూవీ 'హరి హర వీర మల్లు' కు సంబంధించిన ఒక్కో అప్డేట్ అభిమానుల్లో ఎంతో జోష్ ను నింపుతూ ఉంది. ఈ సినిమాలో ఓ ముఖ్యమైన సీన్ లో 1,000 మందికి వ్యతిరేకంగా పవన్ యుద్ధం చేస్తారనే వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఆ భారీ ఫైట్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఓ యోధుడి పాత్రలో కనిపించనున్న పవన్ కళ్యాణ్.. హై-ఆక్టేన్ వార్ సీక్వెన్స్‌లో భాగంగా త్వరలోనే షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. సినిమాకే హైలైట్ గా చెప్పుకునే ఈ యాక్షన్ బ్లాక్ లో 1000 మందికి పైగా ఫైటర్స్ కనిపిస్తారని యూనిట్ వర్గాలు తెలిపాయి.

పవన్ కళ్యాణ్ ఈ పాత్ర కోసం తీవ్రంగా శిక్షణ పొండుతున్నారు. మేకర్స్ విడుదల చేసిన ప్రీ-షూట్ సెషన్ వీడియో ప్రోమో అద్భుతమనే టాక్ వినిపించింది. 'కంచె', 'గౌతమి పుత్ర శాతకర్ణి', 'వేదం' ఫేమ్ క్రిష్ దర్శకత్వంలో మెగా సూర్య ప్రొడక్షన్‌లో నిర్మితమవుతున్న భారీ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. 'హరి హర వీర మల్లు' సినిమాకు సంబంధించిన వీడియోను ఇటీవల చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో పవన్ కళ్యాణ్ ఫైట్స్ కోసం కష్టపడుతూ ఉన్న వీడియోను మనం చూడవచ్చు. మార్షల్ ఆర్ట్స్‌ నిపుణులచే శిక్షణ తీసుకుంటూ పవన్ కళ్యాణ్ కనిపించారు. అందుకు సంబంధించిన ప్రీ-షూట్ ప్రాక్టీస్‌ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.














Next Story