Fans Walk 231 Kilometers To Meet Ram Charan. ఈ మధ్య ఫ్యాన్స్ తమ అభిమాన నటులను కలవడానికి కొత్త మార్గం ఎంచుకున్నారు.
By Medi Samrat Published on 25 Jun 2021 1:34 PM GMT
ఈ మధ్య ఫ్యాన్స్ తమ అభిమాన నటులను కలవడానికి కొత్త మార్గం ఎంచుకున్నారు. కాలి నడకన ఏకంగా వందల కిలోమీటర్లు పాదయాత్ర చేపడుతున్నారు. ఇటీవల ఓ అభిమాని సోనూ సూద్ ను కలవడం కోసం ఏకంగా హైద్రాబాద్ నుంచి ముంబై వరకూ కాలినడకన వెళ్లాడు. గతంలో అల్లు అర్జున్, రష్మిక ల అభిమానులు కూడా ఇలాగే వారిని కలవడం కోసం వందల కిలోమీటర్లు ప్రయాణం చేసిన విషయం తెలిసిందే. తాజాగా రామ్ చరణ్‌ని కలిసేందుకు ముగ్గురు మెగా అభిమానులు కాలినడకన వచ్చి చివరకు తాము అనుకున్నది సాధించారు.
సంధ్య జయరాజ్, రవి, వీరేష్ అనే ముగ్గురు యువకులు జోగులాంబ గద్వాల్ నుంచి హైద్రాబాద్ వరకు దాదాపు 231 కి.మీ పాదయాత్ర చేశారు. నాలుగు రోజులు కష్టపడి తమ అభిమాన నటుడి ఇంటికి వెళ్లి కలిసి ముచ్చట తీర్చుకున్నారు. వారి రాక గురించి తెలుసుకున్న రామ్ చరణ్.. అభిమానులను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. కరోనా సమయంలో రామ్ చరణ్ తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా అభిమానులను ఆలింగనం చేయడాన్ని మెగా ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. అయితే.. ఫ్యాన్స్‌తో కాసేపు ముచ్చట్లు పెట్టిన రామ్ చరణ్ వారిని తిరిగి ఇంటికి పంపించేశారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.