అభిమానులు ఇలా కూడా చేస్తారా అంటూ షాక్ అయిన అనుపమ పరమేశ్వరన్

Fans Give Shock to Anupama Parameswaran. అనుపమ పరమేశ్వరన్ తెలుగులో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది.

By Medi Samrat  Published on  26 April 2022 3:15 PM GMT
అభిమానులు ఇలా కూడా చేస్తారా అంటూ షాక్ అయిన అనుపమ పరమేశ్వరన్

అనుపమ పరమేశ్వరన్ తెలుగులో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. అంతేకాకుండా అడపాదడపా పలు షాపింగ్ సెంటర్స్ ఓపెనింగ్ లో కూడా పాల్గొంటూ ఉంటుంది. అయితే అమ్మడికి ఊహించని షాక్ ఇచ్చారు అభిమానులు. అదేమిటని అనుకుంటూ ఉన్నారా..? సోమవారం ఆమె సూర్యాపేట జిల్లా కోదాడలోని పీపీఆర్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైంది. దీంతో అనుపమను చూసేందుకు స్థానికులు, అభిమానులు భారీగా తరలివచ్చారు.

ఇక షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించిన అనుపమ కాసేపు మీడియాతో మాట్లాడింది. ఆమె తిరిగి వెళ్ళిపోడానికి సిద్ధమవుతూ ఉండగా కొందరు సెల్ఫీలు తీసుకునేందుకు ముందుకు వచ్చారు. అప్పటికే చాలా ఆలస్యమైపోవడంతో ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమైంది. ఆమె కాసేపు అక్కడే ఉండాలని డిమాండ్‌ చేస్తూ కొందరు ఆమె కారు టైర్లలో గాలి తీసేసారు. షాపు నిర్వాహకులు అనపమకు మరో కారు ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు పంపించారు. అభిమానులు ఇలా కూడా చేస్తారా అని అనుపమ షాక్ అయింది.

Next Story
Share it