ఎఫ్3 టార్గెట్ మామూలుగా లేదండోయ్
F3 Movie Pre Release Business. అభిమానులను అలరించడానికి పలు సినిమాలు సిద్ధమవుతూ ఉన్నాయి.
By Medi Samrat Published on 23 May 2022 12:23 PM GMTఅభిమానులను అలరించడానికి పలు సినిమాలు సిద్ధమవుతూ ఉన్నాయి. ఆ లిస్టులో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్3 సినిమా కూడా ఉంది. ఎఫ్2 ఫ్యామిలీ ఆడియన్స్ కు తెగ నచ్చేయడంతో 'ఎఫ్3' మీద అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ పీర్జాదా ఈ సినిమాలో లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా, సొనాల్ చౌహాన్, సునీల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మే 27న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అవ్వబోతోంది. ఎఫ్3 చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ 'యూ' సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు, ఇటీవల కాలంలో ఈ రేంజ్ కామెడీ సినిమా రాలేదని.. ఇది ఖచ్చితంగా ప్రేక్షకులను అలరించడం ఖాయమని చెప్పినట్లు వార్తలు కూడా వచ్చాయి.
అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ఉండటంతో ఎఫ్3 మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలుస్తుందని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా హక్కులను వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.80 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మీడియం బడ్జెట్ మూవీకి ఈ స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ జరగడం నిజంగా విశేషమని చెప్పాలి.
ఎఫ్3 చిత్రం చేసిన ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 22.5 కోట్లు
సీడెడ్ – 10.8 కోట్లు
వైజాగ్ – 7.8 కోట్లు
ఈస్ట్ – 5.1 కోట్లు
వెస్ట్ – 4.5 కోట్లు
కృష్ణా – 4.5 కోట్లు
గుంటూరు – 5.4 కోట్లు
నెల్లూరు – 2.4 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 63 కోట్లు
కర్ణాటక – 4.5 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 2 కోట్లు
ఓవర్సీస్ – 7 కోట్లు
P&P – 3.5 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ ప్రీరిలీజ్ బిజినెస్ – 80 కోట్లు