మళ్లీ తెరపైకి వచ్చిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు
ED summons Tollywood celebrities in drugs case. నాలుగేళ్ల కిందట తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.
By Medi Samrat Published on 25 Aug 2021 7:22 PM ISTనాలుగేళ్ల క్రితం తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మాదక ద్రవ్యాల రవాణా, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 12 మంది టాలీవుడ్ సెలబ్రెటీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. అందులో భాగంగా.. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రానా దగ్గుపాటి, రకుల్ ప్రీత్ సింగ్, చార్మి, రవితేజ, నవదీప్, ముమైత్ ఖాన్, తరుణ్, నందు, శ్రీనివాస్లకు ఈడీ సమన్లు పంపించింది. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్ ఆగస్ట్ 31న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వీరితోపాటు.. రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ మరికొందరికి కూడా నోటీసులు పంపింది. వీరంతా సెప్టెంబర్ 2 నుంచి 22 వరకు హాజరు కావాలని తెలిపింది. అయితే గతంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం పలువురు సినీ ప్రముఖులను విచారించినప్పటికీ సరైన సాక్ష్యాలు లేకపోవడంతో వీరిపై విచారణ చేపట్టలేదు. తెలంగాణ ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ ద్వారా దాదాపు 12 కేసులు నమోదు చేయగా.. 11 ఛార్జ్ షీట్లను ఫిల్ చేశారు.
దాదాపు ఎనిమిది మంది మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై గతంలోనే కేసు నమోదు చేశారు. అయితే సినీ ప్రముఖులకు సంబంధించిన సరైన ఆధారాలు లేకపోవడంతో.. కేవలం కొందరిని విచారించారించి వదిలేసారు. అయితే తాజాగా మరోసారి డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. సెప్టెంబర్ 6న రకుల్ ప్రీత్ సింగ్, సెప్టెంబర్ 8న రానా దగ్గుపాటి, సెప్టెంబర్ 9న రవితేజ, నవంబర్ 15న ముమైత్ ఖాన్ హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. 2017లో సిట్ జూలై నెలలో టాలీవుడ్ ప్రముఖులతో సహా 62 మంది అనుమానితుల నుంచి జుట్టు, గోర్ల నమునాను సేకరించింది. అయితే ఇప్పటికీ వీటి గురించి సిట్ ఏలాంటి ప్రకటన చేయలేదు. మాదక ద్రవ్యాలను ముంబై నుంచి హైదరాబాద్కు రవాణా చేసి.. ఇక్కడ విక్రయిస్తునిన దక్షిణాఫ్రికాకు చెందిన రాఫెల్ అలెక్స్ విక్టర్ పై ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేయబడింది. అతడిని 2017లో అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా.. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు పేర్లను వెల్లడించాడు.