టెన్షల్లో పడ్డ కామెడీ డైరెక్టర్.?

Director Maruthi Up Coming Project. టాలీవుడ్ లో ఎంతో మంది కామెడీ డైరెక్టర్లు తమదైన సత్తా చాటారు. రేలంగి నర్సింహ

By Medi Samrat  Published on  6 Feb 2021 10:49 AM GMT
టెన్షల్లో పడ్డ కామెడీ డైరెక్టర్.?

టాలీవుడ్ లో ఎంతో మంది కామెడీ డైరెక్టర్లు తమదైన సత్తా చాటారు. రేలంగి నర్సింహ, జంద్యాల, ఈవివి సత్యనారాయణ ఇలా కొంత మంది ఎన్నో అద్భుతమైన కామెడీ చిత్రాలను అందించారు. వారి తర్వాత మారుతీ, అనీల్ రావిపూడి తమదైన సత్తా చాటుతున్నారు. భలే భలే మగాడివోయ్ చిత్రం తర్వాత అటు యూత్ కి ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు. ఆ మద్య సాయి ధరమ్ తేజ్ తో తెరకెక్కించిన 'ప్రతిరోజూ పండగే' చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు. తాజాగా యాక్షన్ హీరో గోపిచంద్ తో ఓ చిత్రం తెరకెక్కించే పనిలో పడ్డారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, జీఏ2 సంస్థలు నిర్మిస్తున్నాయి.

ఈ సినిమాను ఇంకా మొదలుపెట్టనప్పటికీ విడుదల తేదిని మాత్రం ప్రకటించేశారు. అక్టోబర్ 1న విడుదల చేస్తున్నట్లు చెప్పారు. మారుతి అనుకున్నట్లు మార్చిలో సినిమాను మొదలుపెడితే.. అక్టోబర్ నాటికి రిలీజ్ చేయడం కష్టమేమీ కాదు.కాకపోతే ఇప్పుడు హీరోయిన్ ప్రాబ్లమ్ వచ్చిందట. వాస్తావానికి ఈ చిత్రానికి సాయి పల్లవిని తీసుకోవాలని అనుకున్నారట..కానీ ఆమె ఎక్కువ పారితోషికం అడిగినట్టు సమాచారం. పోనీ ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వాలని చూసినా.. కాల్షీట్స్ ఖాళీగా లేవు.

దీంతో సాయి పల్లవి రేంజ్ ఉన్న హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. మరోవైపు గోపిచంద్ కోసం స్టార్ హీరోయిన్ నే తీసుకోవాలని పట్టుమీద ఉన్నారట. ఇప్పుడు షూటింగ్ మొదలయ్యేలోపు హీరోయిన్ ని ఫిక్స్ చేసుకోవాలి. హీరోయిన్ ఫిక్స్ అయితే గానీ.. మారుతి సినిమా విషయంలో క్లారిటీ రాదు. ఈ సమస్యను అధిగమించి చెప్పిన సమయానికి సినిమాని విడుదల చేస్తాడో లేదో చూడాలి...!!


Next Story