టాలీవుడ్‌లో మరో విషాదం..!

Director Irugu Giridhar Passed Away. టాలీవుడ్ దర్శకుడు, నటుడు ఇరుగు గిరిధర్ కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు

By Medi Samrat  Published on  2 Aug 2021 8:23 AM GMT
టాలీవుడ్‌లో మరో విషాదం..!

టాలీవుడ్ దర్శకుడు, నటుడు ఇరుగు గిరిధర్ కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. ఆరేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గిరిధర్ అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యారు. ఆయన ఆదివారం నాడు తిరుపతిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం ఇరంగారిపల్లెలో 1957 మే 21న గిరిధర్ జన్మించారు. 1982లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు.


తెలుగులో పలువురు ప్రముఖ దర్శకుల వద్ధ గిరిధర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. టాలీవుడ్ సీనియర్ దర్శకులు కోదండరామిరెడ్డి, గుణశేఖర్, ఈవీవీ సత్యనారాయణ వంటివారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. గుడుంబా శంకర్, అన్నవరం, వన్, సుప్రీమ్, వరుడు వంటి సినిమాలకు కోడైరెక్టర్‌గానూ పనిచేశారు. చంద్రమోహన్, ఆమని, ఇంద్రజ, వినోద్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన 'శుభముహూర్తం' సినిమాకు దర్శకత్వం వహించి విజయాన్ని అందుకున్నారు. ఎక్స్‌ప్రెస్ రాజా, 100 పర్సంట్ లవ్, సర్దార్ గబ్బర్ సింగ్, శ్రీమంతుడు తదితర 20 సినిమాల్లో నటించారు. గిరిధర్ మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
Next Story
Share it