ఆ యంగ్ హీరోను పవన్ కళ్యాణ్ తో పోల్చిన దిల్ రాజు.. ఫ్యాన్స్ ఏమంటారో..?

Dil Raju Praises Vijay Devarakonda. నిర్మాత దిల్ రాజు యంగ్ హీరో విజయ్ దేవరకొండను ఏకంగా పవన్ కళ్యాణ్ తో పోల్చాడు.

By Medi Samrat  Published on  21 Oct 2021 6:43 PM IST
ఆ యంగ్ హీరోను పవన్ కళ్యాణ్ తో పోల్చిన దిల్ రాజు.. ఫ్యాన్స్ ఏమంటారో..?

నిర్మాత దిల్ రాజు యంగ్ హీరో విజయ్ దేవరకొండను ఏకంగా పవన్ కళ్యాణ్ తో పోల్చాడు. విజయ్‌ దేవరకొండ రూపంలో టాలీవుడ్‌కు క్రేజ్‌ ఉన్న హీరో దొరికాడని దిల్‌ రాజు అన్నారు. శిరీష్‌ తనయుడు ఆశిష్‌ హీరోగా తెరకెక్కిన 'రౌడీ బాయ్స్‌' సినిమాలోని రెండోపాటను బుధవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దిల్ రాజు మాట్లాడుతూ విజయ్‌ నాకెంతో కాలంగా తెలుసు. మా బ్యానర్‌లో వచ్చిన 'కేరింత' సినిమా ఆడిషన్స్‌లో భాగంగా విజయ్‌ ఫొటోషూట్‌ కోసం ఓసారి మా ఆఫీస్‌కు వచ్చాడు. ఆ సినిమాలో ఉన్న ముగ్గురు హీరోల్లో ఓ రోల్‌ విజయ్‌ చేయాల్సింది. కానీ కుదరలేదు.


ఆ తర్వాత విజయ్‌ హీరోగా 'పెళ్లి చూపులు' వచ్చింది. ఆ చిత్రాన్ని మా సంస్థ ద్వారా విడుదల చేయాలని ట్రై చేశాడని చెప్పుకొచ్చారు దిల్ రాజు. 'అర్జున్‌రెడ్డి', 'గీతగోవిందం' సినిమాలతో స్టార్‌గా ఎదిగాడు. 'గీతగోవిందం' సక్సెస్‌ సెలబ్రేషన్స్‌కి నేను గెస్ట్‌గా వెళ్ళినప్పుడు అక్కడ విజయ్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ చూసి ఆశ్చర్యపోయా. అతి తక్కువ కాలంలో స్టార్‌డమ్‌ తెచ్చుకున్నాడు. అప్పట్లో పవన్‌ కళ్యాణ్ కు యూత్‌లో ఎంత క్రేజ్‌ వచ్చిందో విజయ్‌ దేవరకొండకు అంత క్రేజ్‌ వచ్చింది. తెలుగు ఇండస్ర్టీకి పవన్‌ కళ్యాణ్ లా ఓ యూత్‌ఫుల్‌ స్టార్‌ దొరికాడని దిల్‌ రాజు చెప్పారు.


Next Story