పవన్ కళ్యాణ్ పై కమెడియన్ అలీ కీలక వ్యాఖ్యలు

Comedian Ali Comments On Pawan Kalyan. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

By Medi Samrat
Published on : 31 Oct 2022 5:15 PM IST

పవన్ కళ్యాణ్ పై కమెడియన్ అలీ కీలక వ్యాఖ్యలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2019 ఎన్నికలకు ముందు జరిగిన కొన్ని పరిణామాలు వీరిద్దరి స్నేహాన్ని దెబ్బతీశాయని కూడా అంటున్నారు. పొలిటికల్ గా వీరెందుకు వేరయ్యారనే విషయం కూడా తెలీదు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ఎలక్ర్టానిక్‌ మీడియా సలహాదారుగా నియమితులయ్యారు అలీ. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అలీ పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. అందుకు తగ్గ ప్రతిఫలమే ఇదని కూడా అంటున్నారు.

ఇక పవన్‌ నటించిన వకీల్ సాబ్, భీమ్లానాయక్ చిత్రాల్లో అలీ నటించకపోవడంపై కూడా పలు చర్చలు జరిగాయి. తాజాగా ఈ విషయంపై అలీ నోరు విప్పారు. 'వకీల్ సాబ్, భీమ్లానాయక్ రెండూ సీరియస్ సినిమాలు. అందులో కామెడీకి పెద్దగా అవకాశం లేదు. నేనే కాదు. అసలు ఏ హాస్యనటుడు కూడా ఆ రెండు సినిమాల్లో నటించలేదు. ఆయన ఏదైనా కామెడీ సినిమా చేస్తే కచ్చితంగా నన్ను పిలుస్తారనుకుంటాను' అని అన్నారు అలీ. తాను హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అలీతో సరదాగా కార్యక్రమానికి పవన్‌ను ఎప్పుడు పిలుస్తారన్న ప్రశ్నకు కూడా ఆయన స్పందించారు. ప్రస్తుతం పవన్ చాలా బిజీగా ఉన్నారని, ఆయనకు సమయం దొరికినప్పుడు కచ్చితంగా ఈ కార్యక్రమానికి వస్తారని అన్నారు.


Next Story