విషాదంలో టాలీవుడ్‌.. ఎన్నో హిట్ సినిమాల కో డైరెక్ట‌ర్ క‌న్నుమూత‌

Codirector Sathyam Passed Away. టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కో డైరెక్ట‌ర్‌‌ సత్యం కన్నుమూశారు.

By Medi Samrat  Published on  17 April 2021 8:17 AM GMT
విషాదంలో టాలీవుడ్‌.. ఎన్నో హిట్ సినిమాల కో డైరెక్ట‌ర్ క‌న్నుమూత‌

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కో డైరెక్ట‌ర్‌‌ సత్యం కన్నుమూశారు. గ‌త‌ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. దీంతో స‌త్యం మ‌ర‌ణ‌వార్త ఇన్న‌ టాలీవుడ్ ప్ర‌ముఖులు.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలావుంటే.. కోడైరెక్టర్‌ సత్యం ఎన్నో సినిమాలకు పనిచేశాడు. కృష్ణవంశీ, రాజమౌళి, త్రివిక్రమ్‌ లాంటి స్టార్‌ డైరెక్టర్ల వద్ద కో డైరెక్టర్‌గా పనిచేశారు. స‌త్యం రాజమౌళి వ‌ద్ద‌ సై, మగధీర, మర్యాద రామన్న సినిమాలకు అసిస్టెంట్‌ దర్శకుడిగా పనిచేశారు. త్రివిక్రమ్ వ‌ద్ద అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌, అల..వైకుంఠపురంలో చిత్రాల‌కు కో డైరెక్టర్‌గా పనిచేశారు. ఇవేకాక‌.. శ్రీరామదాసు, చందమామ, సాక్ష్యం వంటి సినిమాలకు కో డైరెక్టర్‌గా సేవలందించారు.

సత్యం మరణవార్త తెలిసిన వెంట‌నే పూజా హెగ్డే భావోద్వేగానికి గురయ్యారు. 'మా కోడైరెక్టర్ సత్యం గారి మరణ వార్త విని షాక్‌కు గురయ్యాను. ఆయనతో అరవింద సమేత వీర రాఘవ, సాక్ష్యం, అల.. వైకుంఠపురములో చిత్రాలు చేశాను. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నా అంటూ ట్వీట్ చేశారు.

సత్యం మరణవార్త విన్న త‌మ‌న్‌.. ఈ వార్త విని షాక్ గుర‌య్యాను. ఇండ‌స్ట్రీ ఓ నిజాయితీప‌రుడైన జెంటిల్మెన్ ను కోల్పోయింది. దేవుడు ఆ కుటుంబానికి బ‌లాన్ని చేకూర్చాల‌ని.. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని అంటూ.. ట్వీట్ చేశారు.
Next Story
Share it