జీవిత రాజశేఖర్ దంపతులకు షాక్.. 'శేఖర్' సినిమా ప్రదర్శన నిలిపివేయాలని కోర్టు ఆదేశం
City Civil Court Orders to Stop Rajasekhar Sekhar Movie Shows Due To Finance Issues. యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన ‘శేఖర్’ సినిమా
By Medi Samrat Published on
22 May 2022 11:22 AM GMT

యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన 'శేఖర్' సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. దీంతో అన్ని థియేటర్లలో సినిమా షో నిలిచిపోయింది. తనకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకపోవడంతో ఫైనాన్షియర్ పరంధామరెడ్డి కోర్టును ఆశ్రయించారు. అతనికి రావాల్సిన డబ్బును డిపాజిట్ చేసేందుకు కోర్టు డెడ్ లైన్ విధించింది. అయితే జీవిత రాజశేఖర్ దంపతుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సినిమాను నిలిపివేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పుపై రాజశేఖర్ స్పందించారు.
తన సినిమాను కొందరు కుట్రతో అడ్డుకుంటున్నారని ఫైరయ్యారు. 'శేఖర్' సినిమా చేయడానికి చాలా కష్టపడ్డానని చెప్పారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందన్నారు. కొందరు కావాలనే కుట్రలు చేసి.. సినిమాను ఆపి వేయించారు. 'సినిమామా ప్రాణం. ముఖ్యంగా శేఖర్ సినిమాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నాం. నేను చెప్పాల్సి విషయాలు అయిపోయాయి. సినిమా మళ్లీ థియేటర్‌లో ఆడుతుందని ఆశిస్తున్నా..' అంటూ ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. ఈ వివాదంపై హీరో రాజశేఖర్ రేపు కోర్టుకు వెళుతున్నట్లు సమాచారం.
Next Story