సోనూ సూద్ ఆత్మకథ.. మెగాస్టార్ ఫిదా

Chiranjeevi Tweet About Sonu Sood Life Story. వెండితెర మీద విలన్ వేషాలు వేసే సోనూ సూద్ రియల్ లైఫ్ లో మాత్రం హీరో

By Medi Samrat
Published on : 30 Dec 2020 6:27 PM IST

సోనూ సూద్ ఆత్మకథ.. మెగాస్టార్ ఫిదా

వెండితెర మీద విలన్ వేషాలు వేసే సోనూ సూద్ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అని తెలుస్తోంది. నటుడు నిర్మాతగా కూడా మారుతున్నాడు. త్వరలో సొంత చిత్ర నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. ప్రజలలో స్ఫూర్తిని నింపే కథలతో చిత్రాలు నిర్మించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు నిర్మాతగా మారుతున్నానని సోనూ సూద్ తెలిపారు. అలాంటి కథల కోసం ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే మా సంస్థ నుంచి సినిమా వస్తుందని చెప్పారు సోనూసూద్.



సోనూ సూద్ ఆత్మకథ పుస్తకం 'అయాం నో మెసయ్య' విడుదల అయ్యింది. తన ఆత్మకథ పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవికి సోనూసూద్ అందించారు. ఈ సందర్భంగా సోనుపై తనకున్న అభిమానాన్ని చిరు ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. 'నీ పుస్తకం విడుదల సందర్భంగా కంగ్రాట్స్ సోను. హీరోలు జన్మించరు, వారు తయారవుతారనే విషయాన్ని నీవు మరొకసారి నిరూపించావు. ఎన్నో వేల మందిని ఆదుకుని, ఎంతో ఎత్తుకు ఎదిగావు. నీ జీవిత ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం' అని ట్వీట్ చేశారు. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా సంస్థ ప్రచురించింది. మీనా అయ్యర్ ఈ పుస్తకానికి సహ రచయితగా ఉన్నారు.


Next Story