సుందర్‌ పిచాయ్‌కి నిర్మాత బన్నీ వాసు లేఖ‌

Bunny Vasu Letter to Sundar Pichai. టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు.. గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కి లేఖ రాశారు.

By Medi Samrat  Published on  25 July 2021 10:41 AM GMT
సుందర్‌ పిచాయ్‌కి నిర్మాత బన్నీ వాసు లేఖ‌

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు.. గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కి లేఖ రాశారు. సామాజిక మాద్యమాల్లో వేధింపులు త‌ట్టుకోలేక పోతున్నామ‌ని బన్నీ వాసు.. సుందర్‌ పిచాయ్‌కి త‌న భాధ‌ను లేఖ‌లో వెల్ల‌డించారు. ఇంటర్నెట్‌ స్వేచ్ఛకు మద్దతుగా ఇటీవల గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ చేసిన వ్యాఖ్యల పట్ల.. బన్నీ వాసు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారు. ప్రస్తుతం బన్నీ వాసు రాసిన‌ లేఖ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.


సోష‌ల్ మీడియా తప్పుడు ప్రచారం వల్ల తన కుమార్తె, తాను ఎంతో మానసిక క్షోభ అనుభవించినట్లు మొర‌పెట్టుకున్నారు. ఒకరు పెట్టిన పోస్టు అబద్ధమని నిరూపించడం చాలా కష్టమ‌ని.. స్వయంగా ఆ క‌ష్టాన్ని తాను ఫేస్‌ చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి తన కూతురిని చంపుతానని సోష‌ల్ మీడియాలో వీడియో పెడితే.. దాన్ని తీయించడం ఎంతో క‌ష్ట‌మైంద‌ని.. సినీ పరిశ్రమలో కొద్దో గొప్పో పలుకుబడి ఉన్న తనకే ఇంత కష్టమైతే.. సామాన్యుల పరిస్థితి ఏంటని బన్నీవాసు సుందర్‌ పిచాయ్‌ని ప్రశ్నించారు. ఇదిలావుంటే.. బన్నీ వాసు ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.


Next Story