బోయపాటి, రామ్ పోతినేని సినిమా ప్రారంభం

Boyapati and Ram Pothineni’s next movie ‘RAPO 20’ gets grand launch . ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పోతినేని, బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ ఎంటర్‌టైనర్‌

By Medi Samrat  Published on  1 Jun 2022 3:27 PM IST
బోయపాటి, రామ్ పోతినేని సినిమా ప్రారంభం

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పోతినేని, బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ ఎంటర్‌టైనర్‌లో నటించనున్నారు. బుధవారం ఈ చిత్రాన్ని అధికారికంగా లాంచ్ చేసిన మేకర్స్.. హైదరాబాద్‌లో అధికారికంగా పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ మొత్తం టీమ్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజ‌ర‌య్యారు. ఈ చిత్రానికి బూరుగుపల్లి శివ రామకృష్ణ కెమెరా ఆన్ చేయగా.. స్రవంతి రవికిషోర్ మొదట క్లాప్ కొట్టారు.

బోయపాటి శ్రీను మొదటి సన్నివేశానికి దర్శకత్వం వహించగా.. ఎన్ లింగుస్వామి, వెంకట్ ప్రభు స్క్రిప్ట్‌ను అందజేశారు. తాత్కాలికంగా 'రాపో 20' అనే పేరుతో తెర‌కెక్క‌నున్న‌ ఈ చిత్రంలో రామ్ పోతినేని ఎనర్జిటిక్ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమా పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుందని భావిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యాన‌ర్‌ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమా.. మాస్ అప్పీల్ ఉన్న కథ అని అంటున్నారు.












Next Story