అదరగోడుతున్న బిగ్ బాస్ హౌస్ మేట్ ఫస్ట్ మూవీ ఫస్ట్ లుక్..

BiggBoss fame RyanSohel debut film as hero. బిగ్ బాస్ సీజన్ 4 ఫైనలిస్ట్ సోహెల్ సినిమా తో హీరోగా రాబోతున్నాడు

By Medi Samrat  Published on  3 March 2021 11:36 AM GMT
Biggboss4 contest Sohel

బిగ్ బాస్ సీజన్ 4 ఫైనలిస్ట్ సోహెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బిగ్ బాస్ షోతో మంచి ఇమేజ్ ని క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఇక బిగ్ బాస్ షో నుంచి బయటకి వచ్చాక మంచి మంచి ఆఫర్లు అందుకుంటున్నాడు. ఇక ఎట్టకేలకు సినిమా తో హీరోగా రాబోతున్నాడు. టాలీవుడ్‌లో కొన్ని చిత్రాల్లో చిన్నతరహా పాత్రలు పోషించిన సోహెల్‌కు హీరోగా ఇదే తొలిచిత్రం.ఇక ఆ సినిమా కి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. క్యూట్ గా ఉండే సోహెల్ రఫ్ అండ్ టఫ్ మాచో లుక్స్‌తో సరికొత్తగా బయటికొచ్చాడు. మైక్ మూవీస్ ప్రొడక్షన్ నంబర్ 3 కింద నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా సోహెల్ పోస్టర్‌ను విడుదల చేశారు.


చేతికి బ్యాండ్లు, మోచేతులపై పచ్చబొట్లు, ఓ చేతిలో సిగరెట్, మరో చేతిలో టాటూ మిషప్ పైప్ పట్టుకుని సీరియస్ గా చూస్తున్నాడు. సోహెల్‌ను కొత్త గెటప్‌తో, కొత్త వెంచర్‌లోకి తీసుకెళ్తున్నట్లు మూవీ టీఎం తెలిపింది.ఈ సినిమాని "జార్జీ రెడ్డి","ప్రెజర్ కుక్కర్" సినిమాలను నిర్మించిన అన్నపరెడ్డి అప్పిరెడ్డి ఈ చిత్రం నిర్మిస్తున్నాడు.సజ్జల రవిరెడ్డి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదివరకు టాలీవుడ్‌లో కొన్ని చిత్రాల్లో చిన్నతరహా పాత్రలు పోషించిన సోహెల్‌కు హీరోగా ఇదే తొలిచిత్రం. శ్రీనివాస్ వింజనంపాటి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

Next Story
Share it