'బంగార్రాజు' వ‌సూళ్ల సునామీ.. కేవ‌లం మూడు రోజుల్లోనే..

‘Bangarraju’ bags Rs 53 crore in just 3 days. తండ్రీ కొడుకులు అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కాంబినేషన్‌లో వచ్చిన

By Medi Samrat  Published on  17 Jan 2022 10:10 AM GMT
బంగార్రాజు వ‌సూళ్ల సునామీ.. కేవ‌లం మూడు రోజుల్లోనే..

తండ్రీ కొడుకులు అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కాంబినేషన్‌లో వచ్చిన 'బంగార్రాజు' ప్రస్తుతం బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతోంది. పండుగ వాతావరణంలో విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కేవ‌లం మూడు రోజుల్లోనే రూ.53 కోట్లు వ‌సూలు చేసింది. ఈ సినిమాలో నాగార్జున టైటిల్ రోల్ 'బంగార్రాజు' పాత్ర‌లో న‌టించ‌గా.. త‌న‌యుడు నాగ చైతన్య చిన్ని బంగార్రాజుగా నటించారు. సంక్రాంతి చిత్రంగా విడుదలైన‌ 'బంగార్రాజు' అభిమానుల అంచనాలను అందుకుని అక్కినేని ఫ్యామిలీకి మ‌రిచిపోని జ్ఞాపకంగా నిలిచింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. సంక్రాంతికి విడుద‌లైన సినిమాల‌లో 'బంగార్రాజు' కు థియేటర్లలో గ‌ట్టి పోటీ ఇచ్చే సినిమా మ‌రోటి లేకపోవడంతో మ‌రికొన్ని రోజులపాటు క‌లెక్ష‌న్లు ఇలానే ఉంటున్నాయి అంటున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి, రమ్యకృష్ణ నటిస్తున్నారు. అఖిల్ అక్కినేని సోమవారం నాడు టీమ్ మొత్తానికి ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతికి మాకు మరో బ్లాక్‌బస్టర్ అందించినందుకు మా దర్శకుడు క‌ళ్యాణ్ కృష్ణ‌కి ధన్యవాదాలు. బంగార్రాజు టీమ్ అంద‌రికి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.


Next Story
Share it