బండ్ల గణేష్ ఆడియో కాల్ లీక్ అంటూ ప్రచారం.. ట్విట్టర్ లో వరుస పోస్టులు కూడా..

Bandla Ganesh Call Recording was leaked in Social Media was it Real or fake. పవన్ కళ్యాణ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే నిర్మాత, నటుడు బండ్ల గణేష్ స్పీచ్ హైలైట్ గా

By Medi Samrat  Published on  22 Feb 2022 11:13 AM IST
బండ్ల గణేష్ ఆడియో కాల్ లీక్ అంటూ ప్రచారం.. ట్విట్టర్ లో వరుస పోస్టులు కూడా..

పవన్ కళ్యాణ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే నిర్మాత, నటుడు బండ్ల గణేష్ స్పీచ్ హైలైట్ గా నిలుస్తూ ఉంటుంది. ఎన్నో ఆడియో రిలీజ్ లలో బండ్ల గణేష్ స్పీచ్ అదుర్స్ అంటూ చెబుతూ వస్తుంటారు. అద్భుతమైన స్పీచ్ ను రెడీ చేసుకుని స్టేజ్ ఎక్కి.. పవన్ కళ్యాణ్ గురించి ఆయన చెప్పే మాటలు అభిమానులకు పూనకాలు తెప్పిస్తూ ఉంటాయి. అయితే బండ్ల గణేష్ కు సంబంధించిన ఓ ఆడియో అంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ కాల్ రికార్డింగ్ వైరల్ అవుతూ ఉంది.

బండ్ల గణేష్ అభిమాని ఒకతను ఫోన్ చేసి 'అన్న భీమ్లానాయక్‌ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌కు వెళ్తున్నావా..' అని అడిగాడు. దీనికి బండ్ల గణేష్ వాయిస్ 'త్రివిక్రమ్‌ నన్ను రావొద్దు అన్నాడంటా. అదే ఆలోచిస్తున్నాను. నాకు వెళ్లాలని ఉంది, కానీ పిలవలేరు. త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేసుకొని నన్ను రాకుండా చేస్తున్నాడు. ఆడిటోరియం మొత్తం బండ్లన్న అని అరవండి, నేను స్టేజ్‌ మీదికి వస్తాను' అని చెప్పుకొచ్చాడు. భీమ్లానాయక్‌ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ను సోమవారం నిర్వహించాలని చిత్రయూనిట్ భావించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌ మంత్రి గౌతం రెడ్డి అకాల మరణంతో చిత్ర యూనిట్‌ వేడుకను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

మరో వైపు బండ్ల గణేష్ ట్విట్టర్ లో వరుసగా పోస్టులు పెడుతూ వస్తున్నారు.

"అంజనీ పుత్ర 'పవన ' సుత నామ ..

ఊరకే ఎవరికీ రాదు..

అందరు పుడుతుంటారు చచ్చిపోతుంటారు కానీ కొంద‌రు మాత్రమే చరిత్రలో నిల్చిపోతారు మా దేవర పవన్ కళ్యాణ్" అంటూ మరో పోస్టు పెట్టారు.

పవన్.. అంటే వాయువు. అది లేని చోటు భూమిపై లేదు. పవన్ అభిమానులు లేని చొటు కూడా లేదు. పవన్ పై అభిమానం కూడా వాయువులా అనంతం.జై PawanKalyan దేవర అని, సూర్యుడి తేఙస్సుకు.. చంద్రుడి చల్లదనానికి.. పవన్ పై అభిమానానికి ఎక్సపయిరీ డేట్ లేదు. జై PawanKalyan దేవర అని అంతకు ముందు మరో పోస్టు పెట్టారు.



Next Story