పవన్ కళ్యాణ్ మీద ఒట్టేసిన బండ్ల గణేష్

Bandla Ganesh. బండ్ల గణేష్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ప్రేమో.. అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన

By Medi Samrat
Published on : 7 Sept 2021 2:40 PM IST

పవన్ కళ్యాణ్ మీద ఒట్టేసిన బండ్ల గణేష్

బండ్ల గణేష్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ప్రేమో.. అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ను దేవుడిలా భావించే బండ్ల గణేష్ ఆయన మీద ఒట్టేశాడంటే నిజం చెబుతున్నాడనే అందరూ అనుకుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ మీద బండ్ల గణేష్ ఒట్టేసి మరీ ఓ విషయాన్ని చెప్పుకొచ్చారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి బండ్ల గణేశ్ బయటకు వచ్చిన బండ్ల గణేష్ స్వతంత్ర అభ్యర్థిగా జనరల్ సెక్రటరీ పదవికి జీవితా రాజశేఖర్ పై పోటీ చేసి గెలుస్తానని ఆయన ప్రకటించారు.

ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి బయటకు రమ్మని తనకు చిరంజీవిగారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ చెప్పలేదని తెలిపారు. మెగా ఫ్యామిలీ సభ్యులకు క్షమాగుణం ఎక్కువని... కానీ తాను అంత గొప్పవాడిని కాదని అన్నారు. తన మాటను నమ్మాలని, తన మనస్సాక్షికి నచ్చకే ఆ ప్యానల్ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. తాను దేవుడిగా భావించే పవన్ కళ్యాణ్ మీద ఒట్టు అని అన్నారు. జీవిత ఎన్ని మాట్లాడినా మెగా ఫ్యామిలీ క్షమించవచ్చేమో కానీ తాను మాత్రం క్షమించలేనని అన్నారు.


Next Story