క్యాష్ అనుదీప్ లేటెస్ట్ మూవీలో స్టార్స్..!

Anudeep Movie New Update. అనుదీప్.. అలా పిలవడం కంటే క్యాష్ అనుదీప్ అంటే అందరికీ గుర్తొస్తాడు. 'జాతిరత్నాలు'

By Medi Samrat  Published on  6 Sep 2021 5:19 AM GMT
క్యాష్ అనుదీప్ లేటెస్ట్ మూవీలో స్టార్స్..!

అనుదీప్.. అలా పిలవడం కంటే క్యాష్ అనుదీప్ అంటే అందరికీ గుర్తొస్తాడు. 'జాతిరత్నాలు' దర్శకుడైన అనుదీప్ క్యాష్ ప్రోగ్రామ్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. జాతిరత్నాలు సినిమాలో ఆర్టిస్టులకు ఎంత ఫాలోయింగ్ వచ్చిందో.. దర్శకుడు అనుదీప్ కు అంతకన్నా ఎక్కువ ఫాలోయింగ్ దక్కింది. జాతిరత్నాలు సినిమా హిట్ తర్వాత అనుదీప్ తీసే సినిమా ఏమిటా అని అందరిలో ఆసక్తి నెలకొంది.అనుదీప్ పెద్ద స్టార్స్ తోనే సినిమా తీయాలని అనుకుంటూ ఉన్నాడు.

ఆ సినిమాలో తమిళ కథానాయకుడు శివకార్తికేయన్ సరసన అందాలతార రష్మిక కథానాయికగా నటించనున్నట్టు తెలుస్తోంది. శివకార్తికేయన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో రష్మిక కథానాయికగా నటించే అవకాశం ఉందని సమాచారం. కంప్లీట్ ఫన్ మూవీగా తెరకెక్కిన జాతిరత్నాలు సినిమా మంచి వసూళ్లను రాబట్టుకుంది. ఇప్పుడు శివకార్తికేయన్ సినిమా ఎలా ఉండబోతోందో అని అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు. శివ కార్తికేయన్ నటించిన 'డాక్టర్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరో వైపు రష్మిక వరుసగా సినిమాలతో దూసుకుపోతోంది.


Next Story