పిచ్చెక్కిస్తున్న మ‌రో యాంకర్‌..

Anchor Manjusha Latest Photo Shoot. బుల్లితెరపై ఇప్పటి వరకు ఎంతో మంది యాంకర్లు తమదైన యాంకరింగ్ తో అందరి

By Medi Samrat  Published on  26 Feb 2021 2:47 PM IST
పిచ్చెక్కిస్తున్న మ‌రో యాంకర్‌..

బుల్లితెరపై ఇప్పటి వరకు ఎంతో మంది యాంకర్లు తమదైన యాంకరింగ్ తో అందరి మన్ననలు పొందారు. గత కొంత కాలంగా యాంకర్లు హీరోయిన్ల కన్నా హాట్ లుకింగ్ తో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తున్నారు. ముఖ్యంగా అనసూయ, రష్మి, శ్రీముఖి లాంటి యాంకర్లు బుల్లితెర హాట్ యాంకర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం బుల్లితెరపైనే కాదు వెండి తెరపై కూడా తమ సత్తా చాటుతున్నారు. ఇక యాంకర్ మంజూష ఎన్టీఆర్ 'రాఖీ' సినిమాలో ఆయన చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే.



ఈ మూవీలో ఎంతో సాంప్రదాయంగా కనిపించింది. అత్త పెడుతున్న భాదల్నీ తట్టుకుంటూ.. తాను చేసిన నటన ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు యంకర్స్ అంటే తమ అందచందాలతో జనాలను ఆకర్షించే విధంగా ఉండాలని ఫిక్స్ అయినట్లు ఉన్నారు. స్టార్ యాంక‌ర్స్ తాకిడి త‌ట్టుకోవాలంటే కాస్త గ్లామ‌ర్ షో చేయ‌క త‌ప్ప‌ద‌ని భావించిందో ఏమో హాట్ హాట్‌గా ఫొటో షూట్స్ చేస్తూ హీటెక్కిస్తుంది.



మొదటి సారి నిక్కరేసి ఫోటోల‌కు ఫోజిచ్చిన‌ యాంకర్ మంజూష.. హాట్‌లుక్‌లో అదరగొడుతుంది. తాజాగా ఈ అమ్మడు ఫోటోలు సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. నెటిజ‌న్లు మొత్తానికి ఈ అమ్మడు కూడా హాట్ యాంకరమ్మల బాట పట్టిందని అంటున్నారు. ఒక‌వైపు యాంక‌రింగ్ చేస్తూనే అడ‌పాద‌డపా స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో క‌నిపిస్తూ సంద‌డి చేస్తుంది.






Next Story