రంగస్థలం.. రామ్ చరణ్ నటనకు అందరూ ఫిదా అయిపోయారు. టాలీవుడ్ లో వచ్చిన ది బెస్ట్ సినిమాల్లో ఇదొకటని చెప్పొచ్చు. ఈ సినిమాలో రామ్ చరణ్ తర్వాత గొప్ప పేరు వచ్చింది యాంకర్ అనసూయకే..! అనసూయలో ఇంత మంచి నటి ఉందా అంటూ అందరూ పొగిడారు. ఇప్పటికీ రంగమ్మత్త అనే పేరు వింటే అనసూయనే గుర్తుకొస్తుంది. అనసూయ ఎక్కడికి వెళ్లినా ఈ పేరుతోనే పిలుస్తూ ఉంటారు.

రామ్ చరణ్-అనసూయల మధ్య సన్నివేశాలు కూడా ఎంతో బాగుంటాయి. ఇక ఈ సన్నివేశాల సమయంలో జరిగిన ఓ సంఘటనను అనసూయ బయటపెట్టింది. రంగస్థలం షూటింగ్ సమయంలో అనసూయ కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా చెఫ్‌ను పిలిపించి వంట చేయించడం తనకెంతో ఆనందంగా అనిపించిందని రంగమ్మత్త చెప్పుకొచ్చింది. సెట్లో భోజనం సమయానికి చేపల కూర రెడీగా ఉన్నప్పటికీ అనసూయకు తినే అలవాటు లేకపోవడంతో.. రామ్ చరణ్ తన చెఫ్‌ని పిలిపించి ఆమె కోసం పన్నీర్‌ను పెద్ద ముక్కలుగా కట్‌ చేసి కూర వండించాడట. అది అచ్చం చేపల కూరలా చాలా రుచిగా ఉండేదని.. రామ్ చరణ్‌కి అలా చేయాల్సిన అవసరం లేదని.. కానీ తన కోసం చెఫ్‌తో ప్రత్యేకంగా అలా వంట చేయించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపింది. ఏది ఏమైనా మెగా పవర్ స్టార్ చాలా మంచి వ్యక్తి అని అనసూయ చెప్పుకొచ్చింది.


సామ్రాట్

Next Story