ఆసుపత్రి పాలైన టాలీవుడ్ హీరో అడివి శేష్

Adivi Sesh Hospitalized. టాలీవుడ్ నటుడు అడివి శేష్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్నిరోజుల కింద అడివి

By Medi Samrat  Published on  20 Sep 2021 9:13 AM GMT
ఆసుపత్రి పాలైన టాలీవుడ్ హీరో అడివి శేష్

టాలీవుడ్ నటుడు అడివి శేష్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్నిరోజుల కింద అడివి శేష్ కు జ్వరం రాగా, వైద్య పరీక్షల్లో డెంగీ అని తేలింది. గత వారం ప్లేట్ లెట్ల సంఖ్య బాగా పడిపోయినట్టు గుర్తించి ఈ నెల 18న అడివి శేష్ ను హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నిపుణులైన డాక్టర్ల బృందం అతడి ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. అడివి శేష్ నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ మేజర్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అడివి శేష్ ప్రస్తుతం గూఢచారి-2, హిట్-2 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అడివి శేష్ ఆసుపత్రి పాలయ్యాడన్న విషయం తెలియగానే అభిమానుల్లోనూ, చిత్ర పరిశ్రమలోనూ ఆందోళన మొదలైంది. అడివి శేష్ వీలైనంత త్వరగా కోలుకోవాలని అందరూ ఆశిస్తూ ఉన్నారు.


Next Story