సీనియర్ నటి జయంతి.. ఇక లేరు

Actress Jayanthi Passed Away. సీనియర్‌ నటి జయంతి ఇక లేరు. 76 సంవత్సరాల వయసులో ఆమె కన్నుమూశారు. గత రెండేళ్లుగా

By Medi Samrat  Published on  26 July 2021 10:17 AM IST
సీనియర్ నటి జయంతి.. ఇక లేరు

సీనియర్‌ నటి జయంతి ఇక లేరు. 76 సంవత్సరాల వయసులో ఆమె కన్నుమూశారు. గత రెండేళ్లుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె తెలుగు, తమిళం, మలయాలం, కన్నడ,హిందీ చిత్రాల్లో దాదాపు ఐదు వందలకుపైగా చిత్రాల్లో నటించింది. ప్రముఖ హీరోలకు తల్లిగా, అక్కగా, బామ్మగా ఆమె నటించింది. ఆమె హఠాన్మరణంతో టాలీవుడ్‌ లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

జయంతి 1945 జనవరి 6వ తేదీన జన్మించారు. కన్నడ సినిమా జైనుగూడు ద్వారా ఆమె 1963 సినీరంగ ప్రవేశం చేశారు. కర్ణాటక రాజధాని బెంగుళూరులోని బనశంకరిలో గల తన స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన చాలా సినిమాల్లో తండ్రి పాత్రలకు ఈమె జోడిగా నటించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు వంటి హీరోలకు తల్లి పాత్రల్లో అలరించారు. మోహన్ బాబు హీరోగా నటించిన 'పెదరాయుడు' సినిమాలో రజనీకాంత్ చెల్లెలుగా, మోహన్ బాబు మేనత్త పాత్రలో మెప్పించారు.

ఈమె భర్త ప్రముఖ నటుడు, దర్శకుడు పేకేటి శివరామ్. కన్నడ చిత్ర పరిశ్రమలో ఈమె నెంబర్ వన్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగారు. అక్కడ రాజ్‌కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్ వంటి అగ్ర నటుల సినిమాల్లో కథానాయికగా నటించి అలరించారు. ఆమె మృతి పట్ల తెలుగు, తమిళ, కన్నడ చిత్రపరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.


Next Story