చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటి మృతి
Actress Chitra Passed Away. చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి నల్లెనై చిత్ర (56)
By Medi Samrat Published on
21 Aug 2021 11:13 AM GMT

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి నల్లెనై చిత్ర (56) కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె మృతి చెందినట్లుగా కుటుంబసభ్యులు వెల్లడించారు. చిత్ర బాలనటిగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1980-90 దశకాలలో కన్నడ, తమిళ, తెలుగు భాషలలో అనేక చిత్రాల్లో నటించి నటిగా గుర్తింపు పొందారు. ఊర్కావలన్, చేరన్ పాండియన్, ఎన్ తంగచి పడిచావ సినిమాలలో నటనకు చిత్రకు నటిగా మంచి మార్కులు పడ్డాయి.
చిత్ర 1990లో విజయరాఘవను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత పూర్తిగా ఆమె సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. 1992లో వీరికి మహాలక్ష్మి అనే కుమార్తె జన్మించింది. ప్రస్తుతం చిత్ర పలు సీరియల్స్‌లో నటిస్తోంది. చిత్ర ఆకస్మిక మృతి పట్ల చిత్రపరిశ్రమ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. పలువురు ప్రముఖులు చిత్ర మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. చిత్ర అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం సాలి గ్రామంలో నిర్వహించనున్నట్లుగా ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
Next Story