ఐనాక్స్ ను ప్రారంభించిన అడవి శేష్

Actor Sesh Adivi inaugurates INOX’s 4th multiplex in Hyderabad. హైదరాబాద్ నగరంలో సినీ ప్రియుల కోసం మరో కొత్త మల్టీ ప్లెక్స్ వచ్చేసింది.

By Medi Samrat  Published on  13 May 2022 10:15 AM GMT
ఐనాక్స్ ను ప్రారంభించిన అడవి శేష్

హైదరాబాద్ నగరంలో సినీ ప్రియుల కోసం మరో కొత్త మల్టీ ప్లెక్స్ వచ్చేసింది. భారతదేశపు అగ్రగామి మల్టీప్లెక్స్‌ సంస్ధ ఐనాక్స్‌ లీజర్‌ లిమిటెడ్‌ (ఐనాక్స్‌) నేడు హైదరాబాద్‌లో తమ 4వ మల్లీప్లెక్స్‌ను ప్రారంభించింది. దీన్ని సత్వా నెక్లెస్‌ మాల్‌ వద్ద ప్రారంభించారు. ఈ మాల్‌ కవాడీగూడా మెయిన్‌ రోడ్‌, సికింద్రాబాద్‌ వద్ద ఉంది. ఈ నూతన మల్టీప్లెక్స్‌లో 7 స్క్రీన్స్ ఉన్నాయి. మొత్తం 1534 సీట్లు కలిగిన ఈ మల్టీప్లెక్స్‌లో 103 విలాసవంతమైన రిక్లైనర్‌ సీట్లు ఉన్నాయి. మల్టీ ప్లెక్స్ ప్రారంభానికి నటుడు శేష్ అడవి వచ్చారు.

హైదరాబాద్ లో ఐనాక్స్ కు సంబంధించి ఇప్పుడు మొత్తం 26 స్క్రీన్స్ ఉన్నాయి. కొత్త మల్టీప్లెక్స్‌లోని ఏడు స్క్రీన్స్ కూడా సౌకర్యవంతంగా.. అద్భుతమైన సౌండ్, విజువల్ క్లారిటీతో సినిమాను అందించనుంది. రేజర్‌ –షార్ప్‌ విజువల్స్‌ కోసం అత్యాధునిక డిజిటల్‌ ప్రొజెక్షన్‌ సిస్టమ్‌ లు ఉన్నాయి. అంతేకాకుండా 3డీ వ్యూ కూడా ఉంటుంది. దీనికి వోల్ఫోనీ స్మార్ట్‌ క్రిస్టల్‌ డైమండ్‌ సొల్యూషన్‌ తోడ్పాటునందిస్తుంది. ఏడు స్క్రీన్స్ లలోనూ డాల్బీ అట్మాస్‌ సరౌండ్‌ సౌండ్‌ సిస్టమ్‌ అందుబాటులో ఉంది. సినిమా లవర్స్ కు సూపర్ గా నచ్చుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ మల్టీ ప్లెక్స్ లో చిన్నారుల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా ఉంది.

దీనికి చక్కగా సరిపోయేలా కిడ్డెల్స్‌ అంటూ పేరు పెట్టారు.చిన్నారుల కోసం ప్రకాశవంతమైన, ఉత్సాహవంతమైన ప్లే ఏరియా ఇది.దీనిలో బొమ్మలు, పుస్తకాలు, సంబంధిత యాక్టివిటీలు పిల్లలకు కూడా కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ను ఇస్తాయి. వారికి సినిమా వద్ద పూర్తి ఆహ్లాదకరమైన అనుభూతులను అందిస్తుంది. ఈ సినిమాలో రిక్లెయినర్‌ సీటింగ్‌ కూడా ఉంది. ఇది అత్యంత విలాసవంతంగా, సౌకర్యవంతంగా సినిమా చూసేందుకు తోడ్పాటును ఇస్తుంది. వినియోగదారుల కోసం పేపర్‌ లెస్‌ చెక్‌ ఇన్స్‌, టచ్‌ స్క్రీన్ క్యుఆర్‌ కోడ్‌ ఆధారిత టికెటింగ్ వ్యవస్థ, ఇంటరాక్టివ్‌ ఫుడ్‌ ఆర్డరింగ్‌ వంటివి కూడా లభిస్తాయి. లైవ్‌ కిచెన్‌లో ప్రత్యేకంగా వంటకాలను తయారు చేస్తుంటారు. కోల్డ్‌ కాఫీలు , షేక్స్‌, శాండ్‌విచ్‌లు, బర్జర్స్‌, ఫ్రైలు, నాచోస్‌ , పిజ్జాలు వంటివి లభిస్తాయి. ఇక్కడ తయారు చేసే వంటకాలను తమ ఇంటి నుంచి స్విగ్గీ, జొమాటో లాంటి ప్లాట్‌ఫామ్‌లపై ఆర్డర్‌ చేయడం ద్వారా ఆస్వాదించవచ్చు.

ఐనాక్స్‌ లీజర్‌ లిమిటెడ్‌ రీజనల్‌ డైరెక్టర్‌ – సౌత్‌ , మోహిత్‌ భార్గవ మాట్లాడుతూ.. ''ఈ 7 స్క్రీన్ సినిమా థియేటర్స్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందని.. లగ్జరీతో పాటూ.. అద్భుతమైన సినిమా అనుభవాలను అందిస్తుంది. మంచి ఆహారాన్ని కూడా ఇక్కడ ఆస్వాదించవచ్చు" అని ఆయన తెలిపారు. సికింద్రాబాద్‌ పరిసరాల్లో అత్యంత ప్రజాదరణ పొందనున్న మూవీ డెస్టినేషన్ గా ఇది మారనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త మల్టీప్లెక్స్ ను తెరవడం ద్వారా హైదరాబాద్‌లోని సినీ అభిమానులను స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ స్ర్కీన్‌ల ప్రారంభంతో తెలంగాణలో మా కార్యకలాపాలు మరింత విస్తృతం చేయడం పట్ల సంతోషంగా ఉన్నామన్నారు. ఐనాక్స్‌ దేశవ్యాప్తంగా 72 నగరాలలో 688 స్ర్కీన్‌లను 162 మల్టీప్లెక్స్‌ లలో కలిగి ఉంది.
















Next Story