తల్లి కాబోతున్న ప్రణీత

Actor Pranitha expecting first child with husband Nitin. కన్నడ, తెలుగు, హిందీ చిత్రాలలో పనిచేసిన నటి ప్రణిత సుభాష్ తల్లి కాబోతోంది.

By Medi Samrat  Published on  11 April 2022 3:28 PM IST
తల్లి కాబోతున్న ప్రణీత

కన్నడ, తెలుగు, హిందీ చిత్రాలలో పనిచేసిన నటి ప్రణిత సుభాష్ తల్లి కాబోతోంది. తన మొదటి బిడ్డను భర్త నితిన్‌తో స్వాగతించబోతున్నారు. సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ లో ప్రణీత తాను తల్లైనట్లు ప్రకటించింది. సోనోగ్రఫీ చిత్రాలను పట్టుకుని ఉండగా.. ఆమెను ఆమె భర్త ఎత్తుకుని ఉండడం చూడవచ్చు. గతేడాది మే30న వ్యాపార వేత్త నితిన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది హీరోయిన్ ప్రణీత సుభాష్. కరోనా నేపథ్యంలో కన్ష్యూషన్ ఉండటంతో రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ప్రణీత సుభాష్ గతంలో తెలిపారు.

ప్రణీత తన చేతిలో స్కానింగ్ కు సంబంధించిన ఎక్స్ రే కాపీలను చూపిస్తూ తల్లి అయినట్టుగా తెలిపింది. భర్త నితిన్ 34వ పుట్టిన రోజు సందర్భంగా ప్రణీత ఈ గుడ్ న్యూస్ ను తన అభిమానులతో పంచుకుంది. 'నా భర్త 34వ పుట్టినరోజు సందర్భంగా, పైన ఉన్న దేవతలు మాకు బహుమతిని ఇచ్చారు' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.










Next Story