ఆత్మహత్య చేసుకున్న కాంచన-3 హీరోయిన్

24 year old 'Kanchana 3' actress found dead. కాంచన-3 సినిమాలో హీరోయిన్ గా నటించిన 24 ఏళ్ల నటి అలెగ్జాండ్రా జావి

By Medi Samrat  Published on  23 Aug 2021 11:49 AM IST
ఆత్మహత్య చేసుకున్న కాంచన-3 హీరోయిన్

కాంచన-3 సినిమాలో హీరోయిన్ గా నటించిన 24 ఏళ్ల నటి అలెగ్జాండ్రా జావి తన అద్దె ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయినట్లు గుర్తించారు. పోలీసులు ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.. దర్యాప్తు ప్రారంభించారు. అలెగ్జాండ్రా జావి రష్యన్ యువతి.. రాఘవ లారెన్స్ 'కాంచన 3' లో నటించింది. ఆమె ఉంటున్న నార్త్ గోవా గ్రామంలోని స్థానికులు కొద్దిరోజుల క్రితం ఆమె ప్రియుడు ఆమెను విడిచి వెళ్లిపోయాడని చెప్పుకొచ్చారు. అతడు వెళ్ళిపోయినప్పటి నుండి ఆమె డిప్రెషన్‌లో ఉందని పోలీసులకు తెలిపారు.

కొన్ని రోజుల క్రితం ఆమె తన ప్రియుడితో గొడవపడి విడిపోయిన కారణంతో.. ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. చెన్నై ఫోటోగ్రాఫర్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె ఫిర్యాదు కూడా చేశారు. ఆ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అలెగ్జాండ్రా మరణవార్త ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు తెలియజేశారు. కాంచన-3 లో ఈమెతో పాటూ బిగ్ బాస్ తమిళ్ కంటెస్టెంట్ ఒవియా, నిక్కీ తంబోలి ఇతర హీరోయిన్లుగా నటించారు. ఆమె మరణంపై అన్ని రకాలుగా విచారణ చేస్తామని.. ఆమెను బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చెన్నై వ్యక్తిని కూడా విచారిస్తామని తెలిపారు. ఆమె మరణం గురించి రష్యన్ కాన్సులేట్ కు కూడా సమాచారం అందించారు.


Next Story