ఏప్రిల్ 15 నుంచి విమాన సర్వీసులు!
By అంజి Published on 4 April 2020 10:54 AM ISTహైదరాబాద్: లాక్‌డౌన్ కారణంగా దేశీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న సమయంలో విమానయాన సంస్థలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈ నెల 15 నుంచి దేశీయ విమాన సర్వీసులను పునరుద్ధరించనున్నారని తెలిసింది. ఇప్పటికే పలు విమానయాన సంస్థలు బుకింగ్‌లు కూడా ప్రారంభించాయని తెలుస్తోంది. పలువురు ప్రయాణికులు సైతం ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్నారని సమాచారం.
Also Read: ప్రైవేట్ విమానం బుక్ చేసుకొని భారత్‌కు వెళ్లొచ్చా అని అడుగుతున్నారంట.!
అయితే.. దేశీయ, విదేశీ మార్గాల్లోనూ ఈ నెల 30 వరకు బుకింగ్‌లు తీసుకోబోమని ఎయిర్‌ఇండియా ప్రకటించిందని ఓ దినపత్రిక తన కథనంలో రాసింది. ఆ కథనం మేరకు.. ఈ నెల 14వ తేదీన లాక్‌డౌన్ పూర్తి కానుంది. ఆ రోజు ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నామని ఎయిర్‌లైన్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. గత నెల 24 నుంచి విమాన సర్వీసులను నిలిపివేశారు. విమాన సర్వీసులను యాథావిధిగా కొనసాగించేందు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ రెండు రోజుల క్రితం ప్రకటించారు.
Also Read: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు
ఇండిగో, స్పైస్ జెట్, గో ఎయిర్ విమాన సంస్థలు మాత్రం ఏప్రిల్ 15 నుంచి విమానలు నడిపేందుకు వీలుగా బుకింగ్‌లు ప్రారంభించాయని తెలిసింది. అంతర్జాతీయ విమాన సర్వీసులు మే 1 నుంచి నడపాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఎయిర్ ఏసియా మాత్రం దేశీయ విమాన సర్వీసులు నడపడంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.