ప్రైవేట్ విమానం బుక్‌ చేసుకొని భారత్‌కు వెళ్లొచ్చా అని అడుగుతున్నారంట.!

By అంజి  Published on  4 April 2020 4:34 AM GMT
ప్రైవేట్ విమానం బుక్‌ చేసుకొని భారత్‌కు వెళ్లొచ్చా అని అడుగుతున్నారంట.!

హైదరాబాద్‌: అమెరికాలో తెలుగు వాళ్లు భద్రంగా ఉన్నారని ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది. ఆ కథనం మేరకు... మహమ్మారి కరోనా వైరస్ ప్రభావంతో అమెరికాలు పలు రంగాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయి. అమెరికాలోని పలు సంస్థలు తమ ఉత్పత్తులను కూడా తగ్గించుకుంటున్నాయని అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌ అన్నారు. దీంతో అమెరికా కొలువులకు ముప్పు ఉంటుందని పేర్కొన్నారు. అమెరికాలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసుల సంక్య క్రమంగా పెరుగుతోంది. పోలీసుల్లో 15 శాతం, ఫైర్‌ సిబ్బందిలో 20 శాతం మంది అనారోగ్యం బారిన పడినట్లు ఇక్కడి వార్త పత్రికలు తమ కథనాల్లో పేర్కొన్నాయని తానా అధ్యక్షుడు తెలిపారు.

ఆయన మాట్లాడుతూ.. 'న్యూయార్క్‌ వెల్లాలంటేనే భయంగా ఉంది. తెలుగు ప్రజలు సురక్షితంగా ఉన్నారు. ప్రైవేట్‌ విమానం బుక్‌ చేసుకొని ఇండియాకు వెళ్లొచ్చా అని కొందరు అడుగుతున్నారు. మరికొందరు అనారోగ్యం బారిన పడ్డారు. అయితే వారు ఆస్పత్రుల పాలయ్యే పరిస్థితి రాలేదు' అని అన్నారు.

కంపెనీలు మూతపడకుండా మద్దతుగా నిలిచేందుకు ట్రంప్‌ ప్రభుత్వం 2.2 ట్రిలియన్‌ డాలర్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. దీంతో కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి గాడి తప్పే అవకాశాలున్నాయి. అధ్యక్షుడు ట్రంప్‌.. దేశాన్ని ఆర్థిక పరిస్థితిని కాపాడేపరంగా చర్యలు తీసుకుంటున్నారని తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌ తెలిపారు.

తెలుగు వారిని సాయం చేసేందుకు ముందుంటుందని ఆయన తెలిపారు. కరోనా వైరస్‌ తెలుగు వారికి వెబినార్‌ ద్వారా వైద్యులతో అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మాస్కులు పంపిణీ చేశామన్నారు.

ప్రస్తుతం అమెరికాలో పరిశ్రమలు, కంపెనీలు పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ కాలేదు. 25 శాతం మంది కార్యాలయాలకు వెళ్లి పని చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. కొంత ఉద్యోగాలపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా హెచ్‌1బీ ఉద్యోగాలకు ముప్పు ఉండనుంది. అమెరికాలో హెచ్‌1బీ వీసాపై నాలుగు లక్షల మంది ఉన్నారు.

Next Story
Share it