రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

By అంజి  Published on  4 April 2020 4:52 AM GMT
రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

అమరావతి: రాష్ట్ర స్థాయిలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ఆగ్రోస్‌, మార్క్‌ఫెడ్‌ ఎండీగా ఉన్న లత్కర్‌ శ్రీకేష్‌ బాలాజీరావును కేవలం ఆగ్రోస్‌ ఎండీ పోస్టుకే పరిమితం చేసి, మరో ఐఏఎస్‌ అధికారి ప్రద్యుమ్నకు మార్క్‌ఫెడ్‌ ఎండీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు.

Also Read: కరోనా కట్టడికి.. ఒక్క చుక్క టీకా..! త్వరలో అందుబాటులోకి..

ఫుడ్‌ప్రాసెసింగ్‌, చక్కెర పరిశ్రమ కార్యదర్శిగా ఉన్న కాంతిలాల్‌ దండేను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్‌ చేయమని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, చక్కెర పరిశ్రమ కార్యదర్శి పోస్టు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యకు అప్పగించారు.

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Next Story
Share it