100 కిలోమీటర్లు నడిచి.. ప్రాణాలు విడిచిన డెలివరీ బాయ్
By అంజి Published on 29 March 2020 11:25 AM IST
ఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేసింది. రైళ్లు, బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో రోడ్లు పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయాయి. లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలాది మంది కార్మికులు కాలినడకన సొంతూళ్లకు నడుస్తున్నారు. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్‌కు చెందిన చాలా మంది వలస కార్మికులు తమ పిల్లా పాపలతో కలిసి సొంతూళ్లకు కాలినడకన వెళ్తున్నారు. కాలినడకన ఇంటికి వెళ్తున్న కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కొందరు వందలాది కిలోమీటర్లు నడి వెళ్తున్నారు.
Also Read: మధ్యాహ్నం సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం..
మధ్యప్రదేశ్‌కు చెందిన రణ్‌వీర్ సింగ్ (39).. ఢిల్లీలోని తుగ్లకాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్ ప్రకటించడంతో ఆ రెస్టారెంట్‌ను మూసివేశారు. దీంతో రణ్‌వీర్ సింగ్‌కు ఢిల్లీలో తినడానికి తిండి లేకపోవడంతో సొంతూరికి పయనమయ్యాడు. తనతో పాటు మరో ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారు. 200 కిలోమీటర్ల తన ప్రయాణాన్ని ఢిల్లీ- ఆగ్రా హైవే మీదుగా ప్రారంభించాడు. 100 కిలోమీటర్లు నడిచిన తర్వాత రణ్‌వీర్‌కు కైలాష్ టర్నింగ్ వద్ద ఛాత నొప్పి వచ్చింది. దీంతో ఉన్నట్టుండి ఒక్కసారిగా రణ్‌వీర్ కుప్పకూలిపోయాడు. స్నేహితులు లేపే ప్రయత్నం చేసిన రణ్‌వీర్ లేవలేదు. అయితే రణ్‌వీర్ అప్పటికే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతుదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రణ్‌వీర్ సింగ్ (39) స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని మోర్నే జిల్లాలోని ఓ గ్రామం.
Also Read: వారి కోసం.. జిల్లాల్లో క్వారంటైన్ కేంద్రాలు