విషాదం.. ప్రియురాలి తల్లి ఇచ్చిన కూల్‌డ్రింక్ తాగి యువకుడి మృతి

Young man dies after drinking cooldrink given to him by his girlfriend's mother. ప్రియురాలి తల్లి ఇచ్చిన కూల్‌డ్రింక్‌ తాగి తీవ్ర అస్వస్థతకు గురైన ఓ యువకుడు మృతి చెందాడు.

By అంజి  Published on  23 Nov 2021 9:58 AM GMT
విషాదం.. ప్రియురాలి తల్లి ఇచ్చిన కూల్‌డ్రింక్ తాగి యువకుడి మృతి

హైదరాబాద్‌ నగరంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలి తల్లి ఇచ్చిన కూల్‌డ్రింక్‌ తాగి తీవ్ర అస్వస్థతకు గురైన ఓ యువకుడు మృతి చెందాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మొయీనాబాద్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడు షేక్‌ అయాజ్‌ ప్రేమించాలంటూ ఓ మైనర్‌ బాలిక వెంబడి పడుతున్నాడు. ఈ క్రమంలోనే మైనర్‌ బాలిక తల్లికి విషయం తెలిసి.. అయాజ్‌ను ఇంటికి పిలిపించి మాట్లాడింది. ఈ వయసులో ఇలాంటి వద్దని, మానుకోవాలని, తమ కూతురు వెంట పడితే బాగోదని అయాజ్‌ను హెచ్చరించింది. మైనర్‌ బాలిక ఫిర్యాదుతో అయాజ్‌పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు.

అయినా కూడా అయాజ్‌ మారకపోగా.. అమ్మాయి వెంట పడుతూనే వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల అయాజ్‌ మైనర్‌ బాలికి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలోనే మైనర్‌ బాలిక తల్లి కూల్‌ డ్రింక్‌ ఇచ్చింది. ఆ కూల్‌ డ్రింక్‌ అతి తాగిన అయాజ్‌.. ఇంటికెళ్లాక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ వెంటనే అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. సోమవారం ఉదయం అయాజ్‌ మరణించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మైనర్‌ బాలిక తల్లిపై పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it