ఆదిపురుష్ చూసి వ‌స్తుండ‌గా ప్ర‌మాదం.. ఇద్దరు యువకులు మృతి

Two youths killed in road accident in Tiruvuru. బైకును కారు ఢీకొట్ట‌డంతో ఇద్దరు యువకులు మృతి చెందారు.

By Medi Samrat
Published on : 16 Jun 2023 1:41 PM

ఆదిపురుష్ చూసి వ‌స్తుండ‌గా ప్ర‌మాదం.. ఇద్దరు యువకులు మృతి

బైకును కారు ఢీకొట్ట‌డంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండ‌లం కాకర్ల గ్రామ శివారులో ఈ ప్రమాదం జ‌రిగింది. ఒకే బైక్ పై నలుగురు వ్యక్తులు ప్రయాణించడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులను పల్లెపోగు అశోక్( 24), రవీంద్ర(23)గా గుర్తించారు. మరో ఇద్దరు యువకులు పవన్, యశ్వంత్ ల‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్ర‌స్తుతం వీరు తిరువూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉద‌యం ఆదిపురుష్ సినిమా చూసేందుకు వెళ్లిన యువ‌కులు.. సినిమా చూసి వస్తుండగా ప్ర‌మాదం జ‌రిగింద‌ని చెబుతున్నారు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడం వల్ల కారులో ప్రయాణిస్తున్న వారికి ప్రమాదం తప్పింది. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.


Next Story