తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విద్యా బుద్దులు చెప్పాల్సిన గురువే విద్యార్థిని జీవితాన్ని నాశనం చేశాడు. వివరాళ్లోకెళితే.. దిండిగల్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఉపాధ్యాయుడు నట్రాయన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో పోలీసులు ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేశారు. ఉపాధ్యాయుడికి వివాహమై ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్దతిన ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్నాడు.
ఉపాధ్యాయుడు నట్రాయన్ స్వస్థలం నందనపట్టి. ఏడాది క్రితమే విద్యార్థినితో నట్రాయన్ పరిచయం పెంచుకున్నాడు. విద్యార్థినిని పెళ్లి చేసుకుంటానని చెప్పి నట్రాయన్ అనేక సందర్భాల్లో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఉపాధ్యాయుడి నట్రాయన్ పై కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు నట్రాయన్ ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.