మహిళతో సబ్ ఇన్స్పెక్టర్ రాసలీల‌లు.. బయట పెట్టింది ఎవరంటే..?

Sub-Inspector Illegal Affair With Woman. తమిళనాడు రాష్ట్రం తిరుక్కళుకుండ్రమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే సీఐ ముని శేఖర్‌పై పోలీస్‌

By Medi Samrat  Published on  4 Oct 2021 5:01 PM IST
మహిళతో సబ్ ఇన్స్పెక్టర్ రాసలీల‌లు.. బయట పెట్టింది ఎవరంటే..?

తమిళనాడు రాష్ట్రం తిరుక్కళుకుండ్రమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే సీఐ ముని శేఖర్‌పై పోలీస్‌ ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. శాంతి భద్రతల విభాగం సీఐగా పనిచేసే మునిశేఖర్‌ (50)ను వారం క్రితం రాత్రికిరాత్రే విధుల నుంచి తప్పించి వెయిటింగ్‌లిస్ట్‌లో ఉంచారు. ఆయనపై చర్య తీసుకోవడానికి ప్రధాన కారణం ఓ మహిళతో కలిసి నగ్నంగా రాసలీలల వీడియోలో కనిపించడమే..! వివాహితతో మునిశేఖర్‌ జరిపిన రాసలీలలకు సంబంధించిన వీడియోతో పాటు ఆయనపై పలు ఆరోపణలు చేస్తూ ఓ వ్యక్తి డీజీపీతో పాటు ఇతర పోలీస్‌ ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. ఈ ఫిర్యాదులో అనేక విషయాలను ప్రస్తావించారు. ఇంతకూ అతడిపై ఫిర్యాదు చేసిన వ్యక్తి మరెవరో కాదు ఆ రాసలీలల వీడియోలో ఉన్న మహిళ భర్తే..!

తన భార్యకు మునిశేఖర్‌కు అక్రమసంబంధం ఉన్నట్టు నిర్థారించుకోవడమే కాకుండా, తన భార్యతో రాసలీలల్లో ఉన్న వీడియోలు తన దగ్గర ఉన్నట్టు తెలిపారు. ఈ వ్యవహారం తనకు తెలిసిందని.. దీన్ని తన భార్య వద్ద ప్రస్తావించగా ఆమె సరైన సమాధానం చెప్ప లేదని ఆ వ్యక్తి తెలిపాడు. ఇదే విషయంపై ఇన్‌స్పెక్టర్‌ను నిలదీస్తే తనను తన కుటుంబాన్ని హత్య చేస్తానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో ఆరోపించారు. ఇటీవల కులశేఖర్‌ ఫోనులో వీడియోకాల్స్‌ చేసి నగ్నంగా మహిళతో మాట్లాడుతున్న వీడియోలు కూడా వైరల్‌ అయ్యాయి. ఈ విషయం కూడా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో పోలీసులు మునిశేఖర్‌పై చర్యలు తీసుకున్నారు.


Next Story