ఇంటి టెర్రస్‌పైకి రప్పించి.. 7 ఏళ్ల బాలుడిపై 18 ఏళ్ల యువకుడు లైంగిక దాడి

Seven-year-old boy sodomised by neighbour in Uttarpradesh. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలుడిపై 18 ఏళ్ల యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

By అంజి  Published on  12 Dec 2021 9:17 AM IST
ఇంటి టెర్రస్‌పైకి రప్పించి.. 7 ఏళ్ల బాలుడిపై 18 ఏళ్ల యువకుడు లైంగిక దాడి

దేశంలో మహిళలతో పాటు పురుషులకు కూడా రక్షణ లేకుండా పోతోంది. ఆడ, మగ అనే తేడా లేకుండా కామాంధులు ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా దారుణాలకు తెగబడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలుడిపై 18 ఏళ్ల యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన బల్లియా జిల్లాలో జరిగింది. ఏడేళ్ల బాలుడు తన పరిసరాల్లో నివసించే వ్యక్తి చేత లైంగిక దాడికి గురయ్యాడని పోలీసులు శనివారం తెలిపారు. బాలుడు గురువారం మధ్యాహ్నం బన్స్‌డిహ్ రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలోని తన ఇంటి దగ్గర ఆడుకుంటుండగా, 18 ఏళ్ల నిందితుడు బాలుడిని తన ఇంటి టెర్రస్‌పైకి రప్పించాడు.

ఆ తర్వాత బాలుడి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి, లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అదే సమయంలో బాలుడు గట్టిగా కేకలు పెట్టడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయారని వారు తెలిపారు. బాలుడి తాత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేశామని పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ వినోద్ కుమార్ తెలిపారు. చిన్నారులపై రోజు రోజుకు ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలు చేసి నిందితులకు తగిన శిక్ష పడేలా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Next Story