కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దుర్మరణం

Road accident in Hyderabad KPHB. హైదరాబాద్‌లో కూకట్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

By అంజి  Published on  9 Jan 2022 4:40 AM GMT
కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దుర్మరణం

హైదరాబాద్‌లో కూకట్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బైక్‌ను ఢీ కొట్టిన తర్వాత ఆగకుండా టిప్పర్‌ వెళ్లింది. ఈ క్రమంలోనే మృతదేహాన్ని టిప్పర్‌ 20 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ఆదివారం తెల్లవారు జామున 5 గంటలకు కేపీహెచ్‌బీ కాలనీలో ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మృతుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ జగన్మోహన్‌ రెడ్డిగా గుర్తించారు. జగన్మోహన్‌ రెడ్డి దుర్మరణంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇక నగరంలోని ఎల్బీ నగర్‌ అండర్‌ పాస్‌లో ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. ప్రమాదం తర్వాత కారు డ్రైవర్‌ అక్కడి నుండి పరారయ్యాడు. పోలీసులు కారును అక్కడి నుండి పక్కకు తరలించారు. డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Next Story
Share it