చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం, ఇద్దరి పరిస్థితి విషమం

Road accident in Chittoor district , Two killed. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ఓవర్‌ టేక్‌ చేసేందుకు ముందుకు వెళ్లిన ఓ కారు.. ఎదురుగా వస్తున్న సిమెంట్‌ లోడ్‌

By అంజి  Published on  30 Dec 2021 4:29 AM GMT
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం, ఇద్దరి పరిస్థితి విషమం

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ఓవర్‌ టేక్‌ చేసేందుకు ముందుకు వెళ్లిన ఓ కారు.. ఎదురుగా వస్తున్న సిమెంట్‌ లోడ్‌ లారీని ఢీ కొట్టింది. దీంతో కారు వేగంగా వెనుకకు రావడంతో.. వెనుక ఉన్న లారీ కారు ఢీ కొట్టింది. కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటన రేణిగుంట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మామండూరు కుక్కలదొడ్డి దగ్గర జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరికి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రేణిగుంట పోలీసులు.. గాయపడిన వారిని తిరుపతి ఎస్‌విఆర్‌ఆర్‌ ఆస్పత్రికి తరలించారు. రేణిగుంట సిఐ అంజు యాదవ్, మరియు ఎస్సై సునీల్ , రక్షక్, డెమో సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలిచారు. రోడ్డు ప్రమాదంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో పోలీసులు ట్రాఫిక్‌ క్లియర్ చేస్తున్నారు. ఈ ఘటనపై రేణిగుంట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గురైన కారు నెంబర్‌ MH 03 CS 1777.

Next Story