8వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలిక‌పై క‌న్న తండ్రి అఘాయిత్యం

Raped by father, Class 8 girl delivers baby in Tamil Nadu’s Vellore. తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో గత పది నెలలుగా తన 13 ఏళ్ల కుమార్తెపై

By Medi Samrat  Published on  5 Aug 2022 3:18 PM IST
8వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలిక‌పై క‌న్న తండ్రి అఘాయిత్యం

తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో గత పది నెలలుగా తన 13 ఏళ్ల కుమార్తెపై పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడి.. గర్భం దాల్చేలా చేసిన 44 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలిక కడుపునొప్పితో బాధపడుతూ కనిపించింది. ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బంధువులు ఆమెను వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించగా.. ఆమె గర్భవతి అని వైద్యులు నిర్ధారణ చేశారు. మంగళవారం నాడు.. ఆగస్టు 2న బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై వైద్య బృందం శిశు సంక్షేమ కమిటీకి సమాచారం అందించగా.. వారు వేలూరు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్ బాలికను విచారించగా.. ఈ విషయంపై దర్యాప్తు చేసిన పోలీసు బృందం గత 10 నెలలుగా ఆమె తండ్రి చేతిలో లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు గుర్తించింది.

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. అమ్మాయి తల్లిదండ్రులు విడిపోయారు. ఆమె, ఆమె సోదరుడు ఆమె తాత-అవ్వతో కలిసి ఉంటూ ఉన్నారు. అమ్మాయి తన అమ్మమ్మ వండిన ఆహారాన్ని తన తండ్రికి ఇచ్చొచ్చేది. ఆ సమయంలో తండ్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడని బాలిక వెల్లడించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని తన తండ్రి బెదిరించాడని ఆమె తెలిపింది. దీని ఆధారంగా పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అతడిని పోలీసు కస్టడీకి తరలించారు. వేలూరు మహిళా పోలీసులు అతనిని అరెస్టు చేశారు. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని వివిధ సెక్షన్లు, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.


Next Story